SSMB 29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్? సోషల్ మీడియాలో వైరల్
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారంలో కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమా గురించి రెగ్యులర్ గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించిబోతున్నట్టు టాక్ కూడా వినిపించింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నటీనటుల ఎంపికను రాజమౌళి ప్రారంభించాడు. అయితే ఈ చిత్రానికి మహారాజా అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ కావటంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ధృవీకరించబడనప్పటికీ, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నారు. మార్చిలో చిత్రాన్ని ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా చిత్రీకరించనున్నారు.
అయితే ఇటీవల మహేశ్ నటించిన సినిమాలు సర్కారువారిపాట, గుంటూరు కారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడాయి. దీంతో ఆయన రాజమౌళితో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివాళ్లు పాన్ ఇండియా ట్యాగ్ సొంతం చేసుకోగా, మహేశ్ సైతం ఈ సినిమాతో పాన్ హీరోగా గుర్తింపు పొందనున్నాడు. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుండటం కూడా మహేశ్ కు కలిసివచ్చే అంశం కూడా.
It's a massy Sankranthi!! 🔥#GunturKaaram… In theatres Jan 12th, 2024!!https://t.co/2dIdpaQEn9#Trivikram @MusicThaman @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine #GunturKaaramOnJan12th pic.twitter.com/iQHclSqbS0
— Mahesh Babu (@urstrulyMahesh) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.