చెత్త కుప్పలో దొరికిన ఆ కుక్క పిల్ల… ఇప్పుడు పెద్ద స్టార్.!

చెత్తకుప్పలో దొరికిన ఆ కుక్క పిల్ల.. అనుకోకుండా పెద్ద సినిమా స్టార్ అయిపొయింది. ‘ఎ డాగ్స్ వే హోమ్’ చిత్రంలో ఈ కుక్క పిల్ల నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపొయింది. మనం కూడా ఒకసారి ఈ కుక్క పిల్ల జర్నీ గురించి తెలుసుకుందాం. ఈ స్టార్ డాగ్ పేరు షెలైబ్. 2017 లో అమెరికాలోని టెన్సెస్ లో మేగన్ అనే యానిమల్ కంట్రోల్ అధికారికి ఒక రోజు చెత్త […]

చెత్త కుప్పలో దొరికిన ఆ కుక్క పిల్ల... ఇప్పుడు పెద్ద స్టార్.!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:18 PM

చెత్తకుప్పలో దొరికిన ఆ కుక్క పిల్ల.. అనుకోకుండా పెద్ద సినిమా స్టార్ అయిపొయింది. ‘ఎ డాగ్స్ వే హోమ్’ చిత్రంలో ఈ కుక్క పిల్ల నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపొయింది. మనం కూడా ఒకసారి ఈ కుక్క పిల్ల జర్నీ గురించి తెలుసుకుందాం.

ఈ స్టార్ డాగ్ పేరు షెలైబ్. 2017 లో అమెరికాలోని టెన్సెస్ లో మేగన్ అనే యానిమల్ కంట్రోల్ అధికారికి ఒక రోజు చెత్త కుప్పలో ధీనస్థితిలో ఈ కుక్క పిల్ల కనిపించిందట. అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో అది ప్రమాదంలో పడుతుందని దానిని యానిమల్ షెల్టర్ కి తీసుకెళ్ళడట. అప్పటి నుంచి ఆ కుక్క పిల్ల షెల్టర్ లోనే ఉంటోంది.   

 ఇది ఇలా ఉంటే హాలీవుడ్ రచయితలు కేథరిన్, బ్రూస్ కెమరాన్ లు వాళ్ళు తీయబోయే చిత్రానికి కుక్క కోసం వెతుకుతున్నారు. వారికి కథకు తగిన కుక్క లభించకపోయేసరికి ఈ యానిమల్ షెల్టర్ ని సందర్శించారు. అక్కడ షెలైబ్ ను చూడడం.. అది వాళ్లకు నచ్చడం జరిగింది. అంటే ట్రైనర్లతో దానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే షెలైబ్ సినిమాలో ‘బెల్లా’ పాత్రలో ఒదిగిపోయి మరీ నటించింది. క్రిటిక్స్ సైతం దాని నటనకు ఫిదా అయ్యారు. జనవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది.