క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..!

శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'మహా సముద్రం'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న

క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..!

Sharwanand Maha Samudram: శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహా సముద్రం’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సిద్ధార్ధ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తవ్వగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దర్శకుడు అజయ్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో విలక్షణ నటుడు జగపతిబాబు భాగం అవ్వనున్నారట. ఓ కీలక పాత్ర కోసం అజయ్‌, జగ్గుభాయ్‌ని కలవడం.. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీలో జగపతి బాబు మరో అస్సెట్‌గా మారనున్నారు. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మహాసముద్రంను నిర్మిస్తుండగా.. బైలింగ్వల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

ఆ అవార్డుతో నయన్‌ పెళ్లి లింక్‌.. గెలుచుకున్న తరువాతే వివాహం..!

RRR: ప్రారంభమైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్.. 22న ఎన్టీఆర్ టీజర్‌

Click on your DTH Provider to Add TV9 Telugu