AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas and Ajay Devgn in One Frame: మరో టాలీవుడ్ మూవీలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ టాలీవుడ్‌‌లో వరస ఆఫర్స్ అందుకుంటున్నాడు. దక్షిణాదిలో మెగా మల్టీస్టార్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు.. తాజాగా మరో సూపర్ స్టార్ హీరో సినిమాలో అవకాశం..

Prabhas and Ajay Devgn in One Frame: మరో టాలీవుడ్ మూవీలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో
Surya Kala
|

Updated on: Feb 03, 2021 | 11:54 AM

Share

Prabhas and Ajay Devgn in One Frame: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ టాలీవుడ్‌‌లో వరస ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఇప్పటికే దక్షిణాదిలో మెగా మల్టీస్టార్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు.. తాజాగా మరో సూపర్ స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకున్నాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆదిపురుష్ మూవీ షూటింగ్ పట్టాలెకెక్కింది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ పాత్రలో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

రామాయణగాథకు కాల్పానిక అంశాలను జోడించి తెరకెక్కనున్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా .. మరో బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి గా నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్ ఈ సినిమాలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడిగా కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటికే బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఓంరౌత్‌ కాంబోలో వచ్చిన తన్హాజీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు వీరిద్దరికి మంధ్య మంచి స్నేహం ఉందని అందుకనే అజయ్ దేవగన్ ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఏ ఈవిషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ను తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.. తమిళం, మలయాళం, కన్నడ సహా వివిధ భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. రామాయణంలో మరో కీలక పాత్ర అయిన సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

A;lso Read: సినీ సంగీతానికి చక్రవర్తిలా వెలిగిన స్వర చక్కెరవర్తి చక్రవర్తి!

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితుడు అరెస్టు