టీజర్ టాక్: యాక్షన్ హీరోల… ధర్మ యుద్ధం!

ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇవాళ విడుదలైంది. 53 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ యాక్షన్ లవర్స్‌కు విందు భోజనం అని చెప్పాలి. టీజర్ గురించి ప్రస్తావిస్తే… స్టార్టింగ్ షాట్‌లోనే హై-లెవెల్ ఛేజ్ సీక్వెన్స్.. నెక్స్ట్ షాట్‌లో టిపికల్ యాక్షన్ ఎంట్రీలతో […]

టీజర్ టాక్: యాక్షన్ హీరోల... ధర్మ యుద్ధం!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2019 | 5:08 PM

ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇవాళ విడుదలైంది. 53 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ యాక్షన్ లవర్స్‌కు విందు భోజనం అని చెప్పాలి.

టీజర్ గురించి ప్రస్తావిస్తే… స్టార్టింగ్ షాట్‌లోనే హై-లెవెల్ ఛేజ్ సీక్వెన్స్.. నెక్స్ట్ షాట్‌లో టిపికల్ యాక్షన్ ఎంట్రీలతో హృతిక్.. టైగర్ కనిపిస్తారు. అసలే యాక్షన్స్, స్టంట్స్‌కి కేర్ అఫ్ అడ్రస్ అయిన ఈ హీరోలు.. సినిమాలో పోటాపోటీగా నటించారని చెప్పవచ్చు. ఇక వీరితో పాటు ఒక బీచ్ ఒడ్డున అదరహో అనిపించేలా పింక్ బికినీలో పోజిస్తూ హీరోయిన్ వాణీ కపూర్. మొత్తానికి టీజర్‌ను ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో నింపేశారు.

సినిమా లవర్స్ కంటే ముఖ్యంగా ఈ టీజర్ యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లాంటిది. స్పైసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.