హ్యాపీ మ్యారిడీ లైఫ్ విజయ్: అమలాపాల్
తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో వివాహంపై అమలా పాల్ స్పందించారు. విజయ్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చిన అమలా.. ఆయన వివాహానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపింది. ‘‘విజయ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వారిద్దరికి చాలామంది పిల్లలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అమలా పేర్కొంది. అమలా ప్రస్తుతం ఆడై(తెలుగులో ఆమె)చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె.. పలు విషయాలను […]
తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో వివాహంపై అమలా పాల్ స్పందించారు. విజయ్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చిన అమలా.. ఆయన వివాహానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపింది. ‘‘విజయ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వారిద్దరికి చాలామంది పిల్లలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని అమలా పేర్కొంది. అమలా ప్రస్తుతం ఆడై(తెలుగులో ఆమె)చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె.. పలు విషయాలను షేర్ చేసుకుంది.
ముఖ్యంగా విడాకుల తరువాత తన సినిమా కెరీర్ ఏమైపోతుందోనని చాలా టెన్షన్ పడ్డానని చెప్పుకొచ్చింది. ‘‘నాకు సిస్టర్, ఫ్రెండ్ రోల్స్ వస్తాయనుకున్నా. చివరకు టీవీ సీరియల్స్‌లో కూడా నటించాలేమో అనుకున్నా. కానీ మనలో టాలెంట్ ఉన్నంతవరకు ఎవ్వరూ మనల్ని ఆపలేరని తెలుసుకున్నా’’ అని పేర్కొంది.
ఇక ప్రస్తుతం తాను వేరొకరితో ప్రేమలో ఉన్నానని.. ఆయన సినీ పరిశ్రమకు చెందిన వారు కాదని అమలా వెల్లడించింది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని అమలా స్పష్టం చేసింది.
కాగా 2014లో ఏఎల్ విజయ్, అమలాపాల్ వివాహం జరిగింది. మూడేళ్ల పాటు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యక్తిగత మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు తమ తమ కెరీర్‌లపై దృష్టి పెట్టగా.. ఒక్క సందర్భంలో కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోలేదు.