కంగనా బాయ్ కాట్ ..తగ్గని హీట్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి, ఓ పీటీఐ జర్నలిస్టుకు మధ్య జరిగిన గొడవ తాలూకు హీట్ ఇంకా చల్లారలేదు. ఈ ఘటనపై కంగనా తీరును ఏక్తా కపూర్ ఆధ్వర్యంలోని బాలాజీటెలీఫిల్మ్స్..జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పింది. ఇందుకు ఎంటర్ టైన్ మెంట్స్ జర్నలిస్ట్ గిల్డ్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. కానీ కంగనాను బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేసింది. కంగనా నటిస్తున్న ‘ జడ్జ్ మెంటల్ హై క్యా ‘ […]
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి, ఓ పీటీఐ జర్నలిస్టుకు మధ్య జరిగిన గొడవ తాలూకు హీట్ ఇంకా చల్లారలేదు. ఈ ఘటనపై కంగనా తీరును ఏక్తా కపూర్ ఆధ్వర్యంలోని బాలాజీటెలీఫిల్మ్స్..జర్నలిస్టు లోకానికి క్షమాపణ చెప్పింది. ఇందుకు ఎంటర్ టైన్ మెంట్స్ జర్నలిస్ట్ గిల్డ్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. కానీ కంగనాను బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేసింది. కంగనా నటిస్తున్న ‘ జడ్జ్ మెంటల్ హై క్యా ‘ మూవీని నిర్మిస్తున్న ఏక్తా కపూర్..బ్యానర్.. ఇటీవల జరిగిన ఘటనకు అపాలజీ చెబుతున్నట్టు ప్రకటించింది. అయితే కంగనా పేరును ప్రస్తావించకపోవడం విశేషం. ఈ బ్యానర్ సపోర్టుకు తాము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని, కానీ ఆమె పాల్గొనే కార్యక్రమాలను బహిష్కరించాలన్న నిర్ణయంలో మార్పు లేదని ముంబైలో ఈ గిల్డ్ కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు పేర్కొన్నారు. ఏమైనా.. ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో తన సోదరిని వెనకేసుకు వచ్ఛే ఆమె చెల్లెలు రంగోలీ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపక పోవడం విశేషం. కంగనాకు, ఆమె మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ కు మధ్య రేగిన వివాదంలో రంగోలీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్ఛ చేసిన సంగతి తెలిసిందే. చూడబోతే పీటీఐ జర్నలిస్టుకు, కంగనాకు మధ్య జరిగిన గొడవలో తప్పు తన సోదరిదేనని ఆమె భావించినట్టు ముంబై మీడియా అభిప్రాయపడుతోంది.