‘సైరా’తో సై అంటున్న ‘వార్’ హీరోస్!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చారిత్రాత్మక సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇది ఇలా ఉండగా తెలుగులో ఈ సినిమాకు పోటీగా దసరాకు మరో సినిమా విడుదల కావట్లేదు. నితిన్ ‘భీష్మ’ […]
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చారిత్రాత్మక సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఇది ఇలా ఉండగా తెలుగులో ఈ సినిమాకు పోటీగా దసరాకు మరో సినిమా విడుదల కావట్లేదు. నితిన్ ‘భీష్మ’ దసరా కానుకగా అని నిర్మాతలు చెప్పినా.. అది కాస్తా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే అదే రోజున హిందీలో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ హీరోలుగా చేస్తున్న ‘వార్’ మూవీ రిలీజ్ కాబోతున్నది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. గతంలో హృతిక్ రోషన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 53 సెకన్ల నిడివి కలిగిన వార్ టీజర్ స్పైసీ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ హీరోల ‘వార్’కు ‘సైరా’ ఎలా ధీటుగా జవాబిస్తుందో వేచి చూడాలి.?