Batman: దుమ్ము రేపుతోన్న బ్యాట్‌మ్యాన్ మూవీ ట్రైలర్.. విడుదల ఎప్పుడంటే..?
Batman: హ్యారీ పాటర్, ది ట్విలైట్ వంటి సిరీస్‌లలో నటించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ తన అభిమానుల కోసం మరోసారి సిద్దమయ్యారు. బ్యాట్‌మ్యాన్‌గా
Batman: హ్యారీ పాటర్, ది ట్విలైట్ వంటి సిరీస్‌లలో నటించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ తన అభిమానుల కోసం మరోసారి సిద్దమయ్యారు. బ్యాట్‌మ్యాన్‌గా ముందుకు వస్తున్నారు. హాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది బ్యాట్‌మ్యాన్’ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. మాట్ రీవ్స్ ది బ్యాట్‌మ్యాన్ మూవీని నిర్మించారు. ఈ చిత్రం కోసం చాలా కాలంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరోనా కారణంగా వాయిదా కరోనా ఈ చిత్రానికి అడ్డు తగిలింది. దీంతో కొన్ని రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ అభిమానుల కోసం ‘బ్యాట్‌మ్యాన్’ మరొక కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ చేసే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు ట్రైలర్‌ని పదే పదే చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో రాబర్ట్ ప్యాటిన్సన్ సూపర్ హీరోగా మారడం ద్వారా గొప్ప యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో బ్యాట్‌మ్యాన్ ప్రతీకారం తీర్చుకుంటాడని తెలుస్తోంది. బ్యాట్ మ్యాన్ థియేటర్లలోకి రావడానికి సిద్దంగా ఉంది. ఈ చిత్రం జూన్ 21 న విడుదల కావాల్సి ఉండేది కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. తరువాత సినిమా విడుదల తేదీ అక్టోబర్ 1న నిర్ణయించారు. ఇప్పుడు ఇది 4 మార్చి 2022 న థియేటర్లలో విడుదల కానుంది.