Priyanka Chopra: ముక్కు సర్జరీతో ఫేస్ మొత్తం మారిపోయింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా..
స్ట్రీమింగ్ ముందు నుంచి ఇప్పటివరకు ప్రమోషన్లలో సందడి చేస్తుంది ప్రియాంక. ప్రతి రోజు ఏదో ఒక వార్తతో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. 20 ఏళ్ల క్రితం ముక్కుకు సర్జరీ జరగడంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు చేజారిపోయాయని.. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ నటిగా సినీ అరంగేట్రం చేసి.. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతుంది ప్రియాంక చోప్రా. ఈ గ్లోబల్ స్టార్‌కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ గా వెలుగు వెలుగుతుంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. స్ట్రీమింగ్ ముందు నుంచి ఇప్పటివరకు ప్రమోషన్లలో సందడి చేస్తుంది ప్రియాంక. ప్రతి రోజు ఏదో ఒక వార్తతో మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. 20 ఏళ్ల క్రితం ముక్కుకు సర్జరీ జరగడంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు చేజారిపోయాయని.. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.
2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న కొద్ది సేపటికే తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని… దీంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని.. తన సమస్యను గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారట. తప్పనిసరి పరిస్థితిల్లో ఆపరేషన్ కు సిద్ధమయ్యానని.. సర్జరీ తర్వాత తన ముక్కు షేప్ మారిపోయిందని.. దీంతో తన ఫేస్ మొత్తం చాలా మారిపోయిందట. అయితే అదే సమయంలో తనకు వచ్చిన కొన్ని సినిమాల ఆఫర్స్ చేజారిపోయాయని.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ముక్కు సర్జరీ చేయించుకుని మునుపటి రూపంకి వచ్చనని తెలిపిందీ.




సర్జరీ సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. అదే సమయంలో తనకు తన తండ్రి ధైర్యంగా నిలిచారని.. ముక్కు సరిగ్గా లేని సమయంలోనే అనిల్ శర్మ తనకు పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడని.. ఆయనవల్లే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ప్రేమ వివాహ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
