అదరగొడుతున్న ‘హిప్పీ’ టీజర్
హైదరాబాద్: ‘ఆర్‌ఎక్స్ 100’ సూపర్‌హిట్‌తో ఊహకందిని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువ హీరో కార్తీకేయ. ఈ క్రేజీ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. దిగంగన… కార్తీకేయ పక్కన ఆడిపాడబోతుంది. టీఎన్ కృష్ణ దర్శకత్వం ఈ సినిమాకు కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్‌గా న్యాచురల్ స్టార్ నాని లాంఛ్ చేశారు. ‘ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ‘ఆర్‌ఎక్స్ 100’ కన్నా ఇది పెద్ద సక్సెస్ కావాలని […]

హైదరాబాద్: ‘ఆర్‌ఎక్స్ 100’ సూపర్‌హిట్‌తో ఊహకందిని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువ హీరో కార్తీకేయ. ఈ క్రేజీ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. దిగంగన… కార్తీకేయ పక్కన ఆడిపాడబోతుంది. టీఎన్ కృష్ణ దర్శకత్వం ఈ సినిమాకు కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను రీసెంట్‌గా న్యాచురల్ స్టార్ నాని లాంఛ్ చేశారు. ‘ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ‘ఆర్‌ఎక్స్ 100’ కన్నా ఇది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా బ్రదర్ కార్తికేయ. మొత్తం చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’ అని నాని ట్వీట్ చేశారు.
Happy to launch the teaser of #Hippi starring super talented @ActorKartikeya .wishing you a bigger success than #Rx100 brother. Best wishes to the entire team?Here’s the teaser ..https://t.co/ayn0pasGwm @ActorKartikeya @DiganganaS @im_tnkrishna @rdrajasekar @theVcreations
— Nani (@NameisNani) March 20, 2019
ఈ మూవీ టీజర్‌లో కూడా తన ఫస్ట్ సినిమా మాదిరిగానే లిప్ లాక్స్‌తో అదరగొట్టాడు కార్తీకేయ. వెన్నెల కిషోర్‌తో కలిసి వేసిన కామెడీ పంచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అమ్మాయిలతో ఆడుకునే ప్లే బాయ్‌గా కనిపించనున్నట్టు అర్థమైపోతుంది. ఫస్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీకేయ ‘హిప్పీ’తో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.