కమల్ ఇచ్చిన ఆ సలహా నాలో ఆత్మస్థైరాన్ని పెంచింది: రాణి ముఖర్జీ
లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన విషయంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు దర్శకుడిగా,
Hey Ram completes 20 years: లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన విషయంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా.. మల్టీ టాలెంటెడ్‌తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని రాసుకున్నారు కమల్. ఆయనతో నటిస్తే నటనలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చంటూ పలువురు పేరు మోసిన నటీనటులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ చెప్పుకొచ్చారు. హేరామ్ చిత్రంలో కమల్ సరసన రాణి నటించారు. ఈ సినిమాలో కమల్ పక్కన నటించడం తన కెరీర్‌లో గుర్తుండిపోయే విషయమని అన్నారు.
హేరామ్ చిత్రం 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర షూటింగ్ విశేషాలకు ఆమె గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలోనే కమల్‌తో నటించే అవకాశం రావడంతో.. నటనపరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇక షూటింగ్‌లో కమల్ తనకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని రాణి ముఖర్జీ అన్నారు. ముఖ్యంగా తాను పొట్టిగా ఉండటంతో అప్పట్లో కాస్త ఎత్తుగా ఉన్న చెప్పులు వేసుకునేదాన్నని.. అది చూసిన కమల్, తనకు ఓ సలహా ఇచ్చారని రాణి చెప్పుకొచ్చారు. పొట్టిగా ఉన్నానని తాను బాధపడుతుంటే.. ఎవ్వరైనా మన ఎత్తును చూసి మనల్ని గుర్తించరు, కానీ మనం సాధించిన విజయాలను చూసే గుర్తిస్తారు అని అప్పట్లో కమల్ తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తన ఎత్తు విషయంలో తెలియకుండానే కొత్త ఆత్మవిశ్వాసం పుట్టుకొచ్చిందని తెలిపారు. నటుడికి ఎత్తుతో పనిలేదని, నటించడం, పాత్రలో ఒదిగిపోవడం చాలని అప్పట్లో కమల్ ఇచ్చిన సలహా.. తన కెరీర్‌ను అద్భుతంగా మలుచుకోవడంలో ఎంతో సహాయం చేసిందని రాణి ముఖర్జీ అన్నారు.
Read This Story:మూతపడనున్న రామానాయుడు స్టూడియో.. అసలు కారణమిదేనా..?