హీరో శ్రీకాంత్‌ని పరామర్శించిన మంత్రి తలసాని!
హీరో శ్రీకాంత్‌ని పరామర్శించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర్ రావు ఇటీవల మరణించిన సంగతి..
హీరో శ్రీకాంత్‌ని పరామర్శించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర్ రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్‌ని బుధవారం పరామర్శించారు మంత్రి తలసాని. మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లి శ్రీకాంత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మేక పరమేశ్వర్ రావు చిత్ర పటానికి నివాళులర్పించారు. అలాగే తండ్రి మరణం గురించి శ్రీకాంత్‌తో మాట్లాడారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు నవీన్ యాదవ్, ప్రభాకర్‌లు కూడా ఉన్నారు. కాగా.. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి వెళ్లి శ్రీకాంత్‌ని పరామర్శించి, ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
కాగా.. సోమవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు మేక పరమేశ్వర్ రావు తుది శ్వాస విడిచారు. గత నాలుగు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకా వారి పాలెంలో ఆయన జన్మించారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.