‘ఆమాత్రం దానికి పెళ్లి ఎందుకు..? కావాలంటే సహజీవనం చేస్తా’.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సాధారణంగా హీరోయింగ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారుతుంటారు. అలా వచ్చిన వారిలో మోనిశ మోహన్ మీనన్ ఒకరు. ఈ అమ్మడు ఇటీవలే ఫైట్ క్లబ్ మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మోనిశ మోహన్ మీనన్ తన అందం అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్థిరపడ్డారు. ముఖ్యంగా హీరోయిన్ ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. చాలా మంది తమ కష్టాల గురించి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన అనుభవాలను పంచుకుంది. సాధారణంగా హీరోయింగ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారుతుంటారు. అలా వచ్చిన వారిలో మోనిశ మోహన్ మీనన్ ఒకరు. ఈ అమ్మడు ఇటీవలే ఫైట్ క్లబ్ మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మోనిశ మోహన్ మీనన్ తన అందం అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మోనిశ మోహన్ మీనన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచి సినిమాల పైనే ఆసక్తి ఉండేదని తెలిపింది. అంజలి మీనన్, జోయా అక్తర్ లాంటి దర్శకులను చూసి నేను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నా.. ఇదే విషయం ఇంట్లో చెప్తే ముందు ఇంజినీరింగ్ పూర్తి చెయ్యి చాలు అని అన్నారు. బీటెక్ తర్వాత ఓ జాబ్ లో కూడా చేరాను. కానీ నాకు సినిమా డైరెక్టర్ ఆవాలన్నదే ఆసక్తి. మరోసారి ఇంట్లో చెప్పను. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లో నుంచి పారిపోయాను అని తెలిపింది.
దర్శకుడు రోషన్ ‘కాయంకులం కొచున్ని’ సినిమాకోసం రీసెర్చ్ టీమ్ లో పని చేశాను. ఆతర్వాత ఆయన దగ్గర నాలుగు సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆతర్వాత ఓ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేశాను అని తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. నాకు పెళ్లిపై అంతగా ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకోను కానీ సహజీవనం చేస్తాను అని తెలిపింది. ఇప్పుడు అందరూ రెండు నెలలకే బ్రేకప్ చెప్పుకుంటున్నారు.. ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు అని తెలిపింది మోనిశ మోహన్ మీనన్. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ వైరల్ గా మారాయి.
View this post on Instagram
మోనిశ మోహన్ మీనన్ ఇన్స్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి