ఎన్టీఆర్‌తో రూమర్ల వల్లే ఆ హీరోయిన్‌ టాలీవుడ్‌కు దూరమైందా..!

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి రూమర్లకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఓ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌కు రిలేషన్‌ ఉండేదంటూ అప్పట్లో తెగ పుకార్లు వచ్చాయి. అంతేకాదు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత కొద్ది రోజులకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దీంతో ఎన్టీఆర్ ప్రణతిని వివాహం చేసుకున్నాడని టాక్ నడిచింది. అయితే అసలు తన మధ్య, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:47 pm, Sat, 18 April 20
ఎన్టీఆర్‌తో రూమర్ల వల్లే ఆ హీరోయిన్‌ టాలీవుడ్‌కు దూరమైందా..!

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి రూమర్లకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఓ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌కు రిలేషన్‌ ఉండేదంటూ అప్పట్లో తెగ పుకార్లు వచ్చాయి. అంతేకాదు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత కొద్ది రోజులకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దీంతో ఎన్టీఆర్ ప్రణతిని వివాహం చేసుకున్నాడని టాక్ నడిచింది. అయితే అసలు తన మధ్య, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది ఆ హీరోయిన్. ఇంతకు ఆ భామ ఎవరంటే.. సమీరా రెడ్డి.

‘నరసింహుడు’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సమీరా.. ఆ తరువాత ‘జై చిరంజీవ’, ‘అశోక్‌’ చిత్రాల్లో నటించింది. ‘అశోక్‌’ మూవీలో నటించే సమయంలో వీరిద్దరి మధ్య రూమర్లు వచ్చాయి. ఎన్టీఆర్, సమీరా ఇద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో సమీరా రెడ్డి చాలా ఫీల్ అయ్యిందట. అందులోనూ సమీరా తండ్రిది తెలుగు ప్రాంతం కావడంతో ఆ పుకార్లపై వారి బంధువులకు ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చిందట. ఈ క్రమంలో ఆ పుకార్లకు చెక్‌ పెట్టేందుకు సమీరా.. టాలీవుడ్‌ను వదిలి వెళ్లిందట. ఈ విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

”సాధారణంగా నేను ముక్కుసూటి మనిషిని, అందరిలో కలిసిపోయే మనిషిని. అలాగే ఎన్టీఆర్‌తో కలిసిపోయా. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలను కూడా నేర్చుకున్నా. కానీ మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామని పుకార్లు వచ్చాయి. ఫ్యాన్స్‌ నా పేరును సమీరా రెడ్డి నుంచి సమీరా ఎన్టీఆర్‌గా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే నా టాలెంట్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కేవలం ఎన్టీఆర్‌ హీరోయిన్‌గా చూసేవారు. అయినా నేను ఎన్టీఆర్‌ హీరోయిన్‌గా ఉండాలనుకోలేదు. నేను మంచి నటిని, డ్యాన్సర్‌ను. అందరూ నాలో అదే గుర్తిస్తారనుకున్నా. కానీ ఈ రూమర్లు నన్ను ఇబ్బంది పెట్టాయి. నాకు తెలిసి ఎన్టీఆర్‌ను కూడా ఈ పుకార్లు బాధపెట్టి ఉండొచ్చు” అని సమీరా తెలిపింది. కాగా 2014లో సమీరా అక్షయ్‌ వర్దే అనే పారిశ్రామిక వేత్తను వివాహమాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఈ హీరోయిన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనాతో కర్నూలులో మరో ఇద్దరు మృతి..4కి చేరిన మృతుల సంఖ్య..