బుల్లితెరపై నవ్వించే గ్యాంగ్.. వెండితెరపై భయపెడతారా..?
బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఆటో రాం ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత.. మోస్ట్ పాపులర్ యాక్టర్స్‌గా అవకాశాలు దక్కించుకున్నారు. పలు టీవీల్లో యాంకరింగ్స్ కూడా చేసి అదరగొడుతున్నారు. తాజాగా… వీరు ముగ్గురు కలిసి.. ‘త్రీ మంకీస్’ చిత్రంలో నటించారు. ఈ సినిమా టీజర్‌ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన కాసేపటికే ఈ టీజర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ముగ్గురు ప్రధాన […]

బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఆటో రాం ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత.. మోస్ట్ పాపులర్ యాక్టర్స్‌గా అవకాశాలు దక్కించుకున్నారు. పలు టీవీల్లో యాంకరింగ్స్ కూడా చేసి అదరగొడుతున్నారు. తాజాగా… వీరు ముగ్గురు కలిసి.. ‘త్రీ మంకీస్’ చిత్రంలో నటించారు. ఈ సినిమా టీజర్‌ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన కాసేపటికే ఈ టీజర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
ముగ్గురు ప్రధాన పాత్రల్లో.. స్నేహితులుగా ఈ సినిమాలో నటించారు. థ్రిల్లర్, కామెడీ, హర్రర్ జానర్‌గా తెరకెక్కిన ఈ ‘3 మంకీస్’కి జీ అనిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. జీ నగేష్ నిర్మించారు. ‘మందు పార్టీలు చేసుకుని హ్యాపీగా ఉండే బ్యాచిలర్స్ జీవితాల్లోకి.. సడన్‌గా దెయ్యం ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో’.. అనేది కథ. అంతేకాకుండా.. ఈ చిత్రంలో.. షకలక శంకర్ కూడా ముఖ్యమైన రోల్‌ని పోషిస్తున్నాడు. కాగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Teaser of #ThreeMonkeys was launched by #VictoryVenkatesh and conveyed his wishes to the team
Starring #SudigaliSudheer, Auto #RamPrasad and #GetupSreenu
Produced by #NageshG Directed by #GAnilKumar #3Monkeys #ThreeMonkeysTeaser pic.twitter.com/MioZ0FH7I0
— BARaju (@baraju_SuperHit) September 28, 2019