టీజర్ టాక్: ‘ఆవిరి’కి, ఆత్మకి లింకేంటి?
రవిబాబు..ఈయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఆయన మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా మాత్రం ఆయన మార్క్ స్పెషల్‌గా ఉంటుంది. అనసూయ, అమరావతి, అవును, లడ్డూబాబు, అదిగో పందిపిల్ల లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆవిరి’. ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబాబు త్రిల్లర్స్, […]

రవిబాబు..ఈయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఆయన మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా మాత్రం ఆయన మార్క్ స్పెషల్‌గా ఉంటుంది. అనసూయ, అమరావతి, అవును, లడ్డూబాబు, అదిగో పందిపిల్ల లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆవిరి’. ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబాబు త్రిల్లర్స్, హర్రర్ మూవీస్ తెరకెక్కిచడంతో ఎక్స్‌పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది టీజర్. ఆత్మను మీరు గుర్తించగలరా..! అంటూ ఇందులో చూపించాడు. ఏస్ ప్రొడ్యూసర్ ‘దిల్ రాజు’ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో రవిబాబే నటిస్తూ.. నిర్మించాడు. నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.