అరివీర భయంకర రానాతో ‘హౌస్‌ఫుల్- 4’
బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా విలన్‌గా నటిస్తున్నాడు. ఫర్హాద్ సామే జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కథాంశం పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది. 1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా రూపొందించారు. […]

బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న తాజా చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతి సనన్, బాబీ డియోల్, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా విలన్‌గా నటిస్తున్నాడు. ఫర్హాద్ సామే జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కథాంశం పునర్జన్మల నేపధ్యంలో సాగుతుంది.
1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా రూపొందించారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌లో కామెడీ, కన్ఫ్యూషన్‌తో నింపేసి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే రానా దగ్గుబాటి అరివీర భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి పాత్రను మలిచిన తీరును చూస్తే బాహుబలి మూవీలో దాదాపు ‘కల్కి’ రోల్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. కథలో అక్షయ్‌కి తన పునర్జన్మ గుర్తుకు రాగా.. మిగిలిన నటీనటులకు వారి పునర్జన్మలు గుర్తు చేసే క్రమంలో అక్షయ్ పడిన నానా తంటాలను దర్శకుడు కామెడీగా చిత్రీకరించారు. దగ్గుబాటి రానా నటించిన పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే ఆయన మీటూ ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆ స్థానాన్ని మన భల్లాలదేవుడు భర్తీ చేశాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.