AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ లో మళ్ళీ కాల్పుల కలకలం .. భారత జవాన్ల దుస్తుల్లో… టెర్రరిస్టులు!

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం రెండు ఎన్ కౌంటర్లు, గ్రెనేడ్ దాడులతో ఈ రాష్ట్రం ఉలిక్కిపడింది. రంబన్ జిల్లా బాటోట్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు ఓ ఇంటిలో ప్రవేశించి ఓ వ్యక్తిని బందీగా పట్టుకున్నారని, ఆ ఇంట్లో దాక్కుని కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. ఆ ప్రాంతం చాలాసేపు కాల్పులతో దద్దరిల్లింది. అటు-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఇద్దరు ముగ్గురు […]

కశ్మీర్ లో మళ్ళీ కాల్పుల కలకలం .. భారత జవాన్ల దుస్తుల్లో... టెర్రరిస్టులు!
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Sep 29, 2019 | 4:29 PM

Share

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శనివారం ఉదయం రెండు ఎన్ కౌంటర్లు, గ్రెనేడ్ దాడులతో ఈ రాష్ట్రం ఉలిక్కిపడింది. రంబన్ జిల్లా బాటోట్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు ఓ ఇంటిలో ప్రవేశించి ఓ వ్యక్తిని బందీగా పట్టుకున్నారని, ఆ ఇంట్లో దాక్కుని కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. ఆ ప్రాంతం చాలాసేపు కాల్పులతో దద్దరిల్లింది. అటు-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఆపడానికి ప్రయత్నించగా.. భారత జవాన్ల దుస్తుల్లో వఛ్చిన వీరిని చూసి… అనుమానించిన బస్సు డ్రైవర్.. వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. సమీపంలోని సైనిక చెక్ పోస్టులో సైనికాధికారులకు , పోలీసులకు ఈ సమాచారం అందించాడు. దీంతో జవాన్లు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులకోసం గాలింపు ప్రారంభించారు. టెర్రరిస్టులు ఆ ఇంట్లో ప్రవేశించే ముందు వారిపై బాంబులు కూడా విసిరినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నియంత్రణ రేఖ సమీపంలోని గురేజ్ సరిహద్దుల్లో.. గాందర్ బల్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శ్రీనగర్లో కొందరు మిలిటెంట్లు గ్రెనేడ్లు విసిరారని, అయితే ఎవరూ గాయపడలేదని సమాచారం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించవచ్ఛునని వార్తలు వస్తున్న వేళ.. యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేయవలసిందిగా కశ్మీర్ ను విజిట్ చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రాష్ట్ర పోలీసులను, భారత జవాన్లను ఆదేశించారు. ..

Follow Us
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌