AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి

వేణు తొట్టెంపూడి.. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ఈ టాల్ హీరో.. 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వేణు. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే లయ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. స్వయంవరం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వేణుకు ఆఫర్స్ పెరిగాయి.

ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి
Venu
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2026 | 1:38 PM

Share

స్వయం వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అలాగే వరుస హిట్స్ కూడా అందుకున్నాడు వేణు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు. అలాగే వెంకటేష్ చింతకాలయ రవి, ఎన్టీఆర్ దమ్ము లాంటి సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించాడు. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.  2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయాడు వేణు. మళ్లీ 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే అతిథి అనే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించాడు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

గతంలో ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. హీరోగా దాదాపు 25-26 చిత్రాలలో నటించినట్లు వేణు గుర్తుచేసుకున్నారు. తన మొదటి చిత్రం స్వయంవరంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, కెరీర్ ప్రారంభంలోనే మంచి పికప్ సాధించినట్లు తెలిపారు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, గోపి గోపిక గోదావరి, సదా మీ సేవలో వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరై, తన నటనతో వారిని ఆకట్టుకున్నానని పేర్కొన్నారు. తన విజయానికి కారణం ప్రేక్షకులేనని, మంచి కంటెంట్‌ను ఇచ్చినందువల్లే వారు ఆదరించారని వేణు అన్నారు.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

అయితే, కెరీర్ మధ్యలో సక్సెస్ రేట్ తగ్గడంపై ప్రశ్నించగా, కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకే వెనకబడ్డాను అని అన్నారు వేణు. కానీ గతాన్ని తవ్వుకోవడానికి ఇష్టపడనని, “గతం గతాః” అనేదే తన విధానమని అన్నారు వేణు. దమ్ము, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించినప్పటికీ, చింతకాయల రవి చిత్రంలో రెండు రోజుల అతిథి పాత్రను అసలు లెక్కలోకి తీసుకోనని తెలిపారు. ఇటీవల అతిథి వెబ్ సిరీస్‌తో తిరిగి నటనలోకి వచ్చిన వేణు, ఈ పాత్ర తనకు ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఇలాంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఒక కొత్త చిత్రంలో అంధుడి పాత్రను పోషిస్తున్నట్లు, ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రానికి సూర్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారని, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారని చెప్పారు. పాత్రల ఎంపిక విషయంలో తన విధానాన్ని వివరిస్తూ, కేవలం మెయిన్ రోల్స్ చేయాలనే ఆలోచన లేదని, పాత్రలో డెప్త్, అర్ధవంతమైన విషయాలు ఉంటే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో చాలా మంచి దశలో ఉందని, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని, కేవలం నటించడానికి అన్నట్లుగా వెళ్లి సినిమాలు చేయనని స్పష్టం చేశారు.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.