Trailer Talk: కొత్త కోణాన్ని చూపించిన సుహాస్.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మర్డర్‌లు.. ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ అదుర్స్..
Suhas Family Drama: యూట్యూబ్ స్టార్‌గా పరిచయమై సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడు సుహాస్. 'కలర్ ఫోటో' చిత్రంతో మంచి...
Suhas Family Drama: యూట్యూబ్ స్టార్‌గా పరిచయమై సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడు సుహాస్. ‘కలర్ ఫోటో’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్ తాజాగా.. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. ఇక మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోని లివ్ ఓటీటీ వేదికగా ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ట్రైలర్‌ను గమనిస్తే ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు తనలోని కామెడీని చూపించిన సుహాస్ ఈసారి భయపెట్టించే ప్రయత్నం చేశాడు. ట్రైలర్‌ను గమనిస్తే.. నగరంలో జరిగే వరుస మర్డర్‌లను సుహాస్ చేస్తున్నట్లు చూపించారు. ఇంతకీ సుహాస్ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడన్న ఆసక్తికలగక మానదు. ఇక ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి తండ్రి తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలే ఓ అబ్బాయి, ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఎలా కలిశారు.? వారికి సుహాస్ ఎందుకు సహాయం చేశాడు? లాంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సుహాస్ చెప్పే.. ‘మా అమ్మ మీద మీ అమ్మ మీద కాదు దేశంలో ఉన్న అందరు అమ్మల మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇచ్చేస్తా’. ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
Also Read: మంగళవారం ఏపీలో రైతు భరోసా రెండో విడత సాయం
Top Serials: రోజురోజుకీ వంటలక్కకి షాక్ ఇస్తున్న ప్రేక్షకులు.. రేసులో వస్తున్న కొత్త సీరియల్స్