AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin For Kids: పిల్లల కోసం దశల వారీగా అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌.. ఎలాంటి దుష్ర్పభావాలు ఉంటాయి?

Covaxin For Kids: పిల్లలకు కరోనా టీకాలు పంపిణీకి సంబంధించి కీలక సమాచారం వెలువడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను నవంబర్..

Covaxin For Kids: పిల్లల కోసం దశల వారీగా అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌.. ఎలాంటి దుష్ర్పభావాలు ఉంటాయి?
Subhash Goud
|

Updated on: Oct 22, 2021 | 1:56 PM

Share

Covaxin For Kids: పిల్లలకు కరోనా టీకాలు పంపిణీకి సంబంధించి కీలక సమాచారం వెలువడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ బ్రాండ్ పేరుతోనే 2 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల కోసం తీసుకొచ్చిన టీకాను అత్యవసరంగా వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల కమిటీ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే పిల్లల కొవాగ్జిన్ ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ అనుమతి లభించడంతో పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ మూడో వారం నుంచి పిల్లలకు టీకాల పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముందుగా, దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు టీకాలు అందిస్తామన్నారు. అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు కూడా మొదటి దశలోన టీకాలు వేస్తారు. ఈ జాబితాను రెడీ చేసేందుకు మూడు వారాల సమయం పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

దేశంలో ప్రాంతాల వారీగా వ్యాక్సినేషన్‌..

డీసీజీఐ ఆమోదం తర్వాత పిల్లల కొవాగ్జిన్ టీకాను నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీజీఐ) సభ్యులు సైతం పరిశీలిస్తారని, క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి భారత్ బయోటెక్ సమర్పించిన మధ్యంతర డేటాను కూడా అడ్వైజరీ కమిటీ అధ్యయనం చేస్తుందని, అవసరమనుకుంటే సంస్థ నుంచి అదనపు సమాచారాన్ని కూడా కోరతారని కేంద్ర ప్రభుత్వ అధికారుల ద్వారా సమాచారం.

సాధారణ దుష్ర్పభావాలు:

భారత్ లో పిల్లలు వాడటానికి అనుమతి పొందిన రెండో టీకా భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్. అంతకుముందు జైదూర్ కంపెనీ రూపొందించిన ZyCoV-Dకీ అనుమతి లభించినా అది 12 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే. కొవాగ్జిన్ మాత్రం 2 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారంతా వాడవచ్చు. పెద్దల టీకాలాగే పిల్లలకు కూడా కొవాగ్జిన్ రెండు డోసుల్లో ఇస్తారు. మొదటి, రెండో డోసుకు మధ్య 28 రోజుల విరామం ఉంటుంది. ఇతర టీకాల కంటే కోవాగ్జిన్‌ తక్కువ దుష్ప్రభావాలకు కారణమవుతున్నట్లు తేలినా.. పిల్లల విషయంలో సాధారణ దష్ర్పభావాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

రోగ నిరోధక శక్తిలేని పిల్లలు సురక్షితమేనా..?

రోగ నిరోధక శక్తి లేని పిల్లలు సురక్షితమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి పిల్లలకు టీకా వేయించినా ప్రమాదమేమి లేదని పరీక్షల్లో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏదైనా చిన్నపాటి దుష్ర్పభావం ఉన్న అది ఒకటి, రెండు రోజుల్లోనే తగ్గుతుందంటున్నారు.ఈ టీకా గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.

ట్రయల్‌రన్‌లో ఏం తేలింది..?

ఇప్పటివరకూ భారత్ బయోటెక్ దేశవ్యాప్తంగా 500 మంది పిల్లలపై వ్యాక్సీన్ ట్రయిల్స్ చేసింది. ఇది చాలా చిన్న స్థాయిలో జరిగిన ట్రయిల్ అని కొందరు నిపుణులు భావిస్తున్నారు. పిల్లల్లో టీకా సామార్థ్యం, దుష్ప్రభావాల గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో తక్కువ దుష్ప్రభావాలు ఉన్నట్లు ట్రయిల్స్‌లో తేలిందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా 2 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఎక్కువ డాటాను పరిశీలించాలి అని సునీలా గార్గ్ పేర్కొంటున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో ప్రస్తుతం 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే, దీని గురించి కూడా ఎక్కువ డాటా అందుబాటులో లేదు.

డబ్ల్యూహెచ్‌వో నుంచి ఆమోదం ఉందా..?

వచ్చే ఏడాది త్రైమాసికంలో ఆరోగ్యవంతులైన పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం ఉండే అవకాశం ఉందని డాక్టర్ ఎన్‌కే అరోరా అంచనా వేస్తున్నారు. అయితే కోవాగ్జిన్‌కు అత్యవసర ఆమోదాలు లభించినప్పటికీ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ద్వారా ఇంకా ఆమోదం రాలేదు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన టీకాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. పిల్లల కోసం కోవాగ్జిన్‌ సురక్షతమేనని అని తేలినా.. డబ్ల్యూహెచ్‌వో నుంచి ఆమోదం రాలేదు.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Hackathon 2021: ఆధార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.3 లక్షలు గెలుచుకోవచ్చు.. కానీ వీరికి మాత్రమే

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంతంటే..!