NIkhil Siddharth: గతంలో ఎన్నడూ చేయని పని చేస్తున్న నిఖిల్.. ఇంతకీ ఆ పని ఏంటనేగా.?
NIkhil Siddharth: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేశ్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యాడు నటుడు నిఖిల్ సిద్ధార్థ్...
NIkhil Siddharth: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేశ్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యాడు నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తొలి సినిమాలోనే తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో నిఖిల్ వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. వరుస పరాజయలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో వచ్చిందే ‘స్వామి రారా’ సినిమా. ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత కార్తికేయ, సుబ్రమణ్యపురం, ఎక్కడికి వెళతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం ఇలా వరుస విజయాలను అందుకొని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిఖిల్.
ఇదిలా ఉంటే నిఖిల్ గతంలో ఎన్నడూ ఓ పనిని తన కెరీర్‌లో తొలిసారి చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇంతకీ నిఖిల్ చేస్తోన్న ఆ పని ఏంటో తెలుసా.? ఒకేసారి ఏకంగా నాలుగు చిత్రాల్లో నటించడం. ఈ విషయమై నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ‘ఒకేసారి 4 సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిలో దేనికి మొదటి స్థానాన్ని ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అన్ని సినిమాలకు నాలోని బెస్ట్‌ను ఇస్తున్నాను. అన్ని సినిమాలు మంచి సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు.
నిఖిల్ చేసిన ట్వీట్..
Working on 4 Movies Simultaneously… Never did this before. Always worked only 1 at a time till now.. but this is like 4 kids who r all my favourites but don’t know whom to give max priority to. Giving my best and praying tht all 4 of them get the best release and Success ??? pic.twitter.com/7FdZGsOEbb
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 25, 2021
ఇంతకీ ప్రస్తుతం నిఖిల్ నటిస్తోన్న ఆ నాలుగు చిత్రాల ఏంటంటే.. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2. వీటితో పాటు తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read: Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..
Crime News: వీడు మామూలోడు కాదు.. 37 కోట్ల బీమా డబ్బుల కోసం పాముతో వేరే వ్యక్తిని చంపాడు.. చివరకు
Dog Suicide Bridge : కుక్కల ఆత్మహత్యలకు ప్రసిద్ధి ఆ వంతెన.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఔటే..!