Kartik Aaryan: లేడీ ఫ్యాన్‌కు ఫ్రాంక్‌ కాల్‌ చేసిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. 'ప్యార్‌ కా పంచనామా' తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో ‘సోనీ కి టీటు కీ స్వీటీ', 'లుకా చుప్పి', 'పతి పత్నీ అవురో ఓహ్‌', 'లవ్‌ ఆజ్‌కల్‌ 2' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Kartik Aaryan: లేడీ ఫ్యాన్‌కు ఫ్రాంక్‌ కాల్‌ చేసిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్  హీరో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 10:08 AM

ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగా క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో కార్తిక్‌ ఆర్యన్‌ ఒకడు. ‘ప్యార్‌ కా పంచనామా’ తో వెండితెరకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్‌ హీరో ‘సోనీ కి టీటు కీ స్వీటీ’, ‘లుకా చుప్పి’, ‘పతి పత్నీ అవురో ఓహ్‌’, ‘లవ్‌ ఆజ్‌కల్‌ 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల అతను నటించిన ‘ధమాకా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. కాగా ప్రస్తుతం ‘షాహ్‌జాదా’ అనే ఓ కుటుంబ కథాచిత్రంలో నటిస్తున్నాడు కార్తిక్‌. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ అల వైకుంఠపురములో’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం పుణెలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈక్రమంలోనే కాలేజీ విద్యార్థులు ఈ యంగ్‌ హీరోను చుట్టుముట్టి సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్‌కి ఫ్రాంక్‌ కాల్‌ చేసి సరదాగా ఆటపట్టించాడు కార్తిక్‌. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ‘యష్‌ని మాట్లాడుతున్నాను.. కార్తిక్ ఆర్యన్ ఎక్కడా? అని అడుగుతాడు. మొదట ఆ లేడీ ఫ్యాన్ ఆశ్చర్య పోయినప్పటికి ఆతర్వాత కార్తిక్‌ వాయిస్‌ని గుర్తు పట్టింది. వెంటనే ‘మీరు కార్తిక్ ఆర్యన్ కదా’ అంటుంది. దీంతో అతని చుట్టూ ఉన్న విద్యార్థులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ‘షాహ్‌జాదా’ తో పాటు ‘భూల్‌భూలయ్యా’ సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు కార్తిక్‌. అదేవిధంగా అతను నటించిన ‘ఫ్రెడ్డీ’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Viral Video: కూతురుతో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కోసం స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

Ram Gopal Varma: రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..