AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు నిర్ణయాన్ని మార్చుకున్నాడా..!

మెగాస్టార్ చిరంజీవి నిర్ణయాన్ని మార్చుకున్నాడా..! అంటే టాలీవుడ్‌లో అవుననే మాటలే వినిపిస్తున్నాయి. చిరు, కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంలో మెగాస్టార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. మొదట ఈ మూవీని కూడా పాన్ ఇండియా సినిమాగా తీయాలని చిరు భావించారట. ఈ ప్రాజెక్ట్ […]

చిరు నిర్ణయాన్ని మార్చుకున్నాడా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 9:46 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నిర్ణయాన్ని మార్చుకున్నాడా..! అంటే టాలీవుడ్‌లో అవుననే మాటలే వినిపిస్తున్నాయి. చిరు, కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంలో మెగాస్టార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.

మొదట ఈ మూవీని కూడా పాన్ ఇండియా సినిమాగా తీయాలని చిరు భావించారట. ఈ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ కూడా అన్ని వర్గాలను మెచ్చేలా ఉందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే సైరా ఫలితంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన సైరాను తెలుగులో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే కొన్ని కారణాల వలన అన్ని భాషల్లోనూ ఈ మూవీ ఆడలేకపోయింది. ఒక్క తెలుగులో మినహాయిస్తే మిగిలిన ఏ భాషలోనూ అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. ఇక హిందీలో అయితే పెద్ద పరాజయంగా మిగిలింది సైరా. ఈ క్రమంలో ఇప్పుడు కొరటాల చిత్రాన్ని తెలుగులోనే తీయాలని కొరటాలకు సూచించారట.

ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక టాక్‌ను బట్టి మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేద్దామని ఆయన అన్నారట. దీనికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..