‘మనసుతో ప్రేమించాలంటే, ముందు కళ్లతో చూడాలి కదా’.. మనసును తట్టిలేపుతోన్న ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్.
Gurtunda Seetakalam: ప్రతీ మనిషి తన జీవితంలో ఎవరినో ఒకరిని ప్రేమించే ఉంటారు. తమ మనసును ఎక్కడో ఓ చోట పారేసుకునే ఉంటారు. జీవితమనే ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఉద్యోగం.. ఇలా రకరకాల స్టేజ్‌లను దాటుతూ వస్తుంటాం. ప్రతీ స్టేజ్‌లో...
Gurtunda Seetakalam: ప్రతీ మనిషి తన జీవితంలో ఎవరినో ఒకరిని ప్రేమించే ఉంటారు. తమ మనసును ఎక్కడో ఓ చోట పారేసుకునే ఉంటారు. జీవితమనే ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఉద్యోగం.. ఇలా రకరకాల స్టేజ్‌లను దాటుతూ వస్తుంటాం. ప్రతీ స్టేజ్‌లో మనసుకు నచ్చిన వ్యక్తులు పరిచయమవుతుంటారు. ఇలా తన జీవితంలో ఎదురైన నలుగురు అమ్మాయిలను ఇష్టపడ్డ ఓ కుర్రాడు. చివరికి నలుగురులో ఎవరిని సెలక్ట్ చేసుకున్నాడు. ప్రేమ.. తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అన్న వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన సినిమానే ‘గుర్తుందా శీతాకాలం’. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను గమనిస్తే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ట్రైలర్‌లో వచ్చే ప్రతీ డైలాగ్ మనసును తట్టిలేపుతోంది. కెరీర్‌లో కోమలి, అమ్ము, దివ్య, నిధి ఇలా నలుగురిని ప్రేమించిన హీరో చివరికి తన పాట్నర్‌గా ఎవరిని ఎంచుకున్నాడు అన్న కథను దర్శకుడు ఎంతో సెన్సిటివ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో వచ్చే..
‘శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చనికాలం..’, ‘మనసుతో ప్రేమించాలంటే, ముందు కళ్లతో చూడాలి కదా’ అలాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. నాగశేఖర్ దర్శకత్వం వహించన సినిమాలో సత్యదేవ్ సరసన మేఘా ఆకాశ్, కావ్యాశెట్టి, తమన్నలు నటించారు. మరి ఈ అందమైన ప్రేమ కథతో కూడిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి..
Also Read: Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..
ఇమ్యునిటీ పెంచుకునేందుకు ఈ పండ్లు బెస్ట్.. ఏంటో తెలుసుకొవాలనివుందా..
Viral Photo: ద్యేవుడా.! పామును కనిపెట్టండి చూద్దాం.. గుర్తిస్తే మీరే జీనియస్.!