Viral Photo: ద్యేవుడా.! పామును కనిపెట్టండి చూద్దాం.. గుర్తిస్తే మీరే జీనియస్.!
స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం చిన్నదైపోయింది. ప్రపంచం నలుమూలల వింతలూ, విశేషాలు ఏం జరిగినా చతుక్కున అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి...
స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం చిన్నదైపోయింది. ప్రపంచం నలుమూలల వింతలూ, విశేషాలు ఏం జరిగినా చతుక్కున అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి ఫోటో పజిల్స్. ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే మెదడు ఒకటే పని చేస్తే సరిపోదు.. కళ్లకు కూడా పదును ఉండాల్సిందే. అప్పుడే మీరు క్షణాల్లో ఫోటో పజిల్స్ సాల్వ్ చేయగలరు. ఇలాంటి ఫోటో పజిల్స్ నెట్టింట కోకొల్లలు. అప్పుడప్పుడూ పాత ఫోటో పజిల్స్ సైతం తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిని సాల్వ్ ఎలా చెయ్యాలో తెలియక నెటిజన్లు తల పట్టుకున్నారు.
Find The Snake..@WhatsTrending @TrendingWeibo @ViralHog @TheViralFever @the_viralvideos @itsgoneviraI pic.twitter.com/JutX35q1tB
— telugufunworld (@telugufunworld) February 14, 2022
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి గార్డెన్ ఏరియాలా కనిపిస్తోన్న ఆ ప్రదేశంలో ఓ విషసర్పం నక్కింది. అది ఇంచక్కా సేద తీరుతోంది. ఒకవైపు ఆకుపచ్చని పిచ్చి మొక్కలు, మరో వైపు ఎండిన ఆకులు, కర్ర ముక్కలు ఉండటంతో అదెక్కడుందో కనిపెట్టడం మీకు సాధ్యం కాదు. మీ కళ్లకు పదును పెడితే ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేయగలరు. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేసేందుకు ట్రై చేశారు. నూటికి 90 మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి. కనిపెడితే ఓకే..! లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.
Here is the answer.. pic.twitter.com/0Y17XSsnzQ
— telugufunworld (@telugufunworld) February 14, 2022