AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్.. భర్త కూడా డైరెక్టరే

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ పేరు మార్మోగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా రిలీజై సూపర్ హిట్ కావడమే దీనికి కారణం. అందులో ఆమె అభినయానికి సామాన్య జనాలే కాదు సినీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్.. భర్త కూడా డైరెక్టరే
Tollyewood Actress
Basha Shek
|

Updated on: Oct 18, 2026 | 5:55 PM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. అప్పుడెప్పుడో 2012లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. అది కూడా ఓ తెలుగు సినిమాతోనే. ఈ అమ్మాయికి అందం ఉంది. అభినయం ఇక నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక రెండో సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ మాత్రం ఈ హీరోయిన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అక్కడే ఓ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కూడా. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. సామాన్యు జనాలే కాదు స్టార్ నటీనటులు సైతం ఈమె సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? గరివిడి లక్ష్మి సినిమాతో మన ముందుకు వచ్చిన ఆనంది.

2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది ఆనంది. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లిపోయింది ఆనంది. అక్కడ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. మధ్యలో జాంబిరెడ్డి, శ్రీదేవీ సోడా సెంటర్, ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం, కస్టడీ, శివంగి వంటి తెలుగు సినిమాల్లో నటించింది. గతేడాది ఆనంది నటించిన భైరవం సినిమా బాగానే ఆడింది. ప్రియదర్శితో కలిసి ప్రేమంటే సినిమాలో కూడా హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే కమర్షియల్ గా మంచి సాలిడ్ హిట్ పడలేదీ అందాల తారకు. అయితే ఇప్పుడు ఆ లోటును తీరుస్తూ ఆనంది మెయిన్ లీడ్ లో నటించిన గరివిడి లక్ష్మి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమాను తెరకెక్కించారు దర్శకుడు గౌరి నాయుడు జమ్ము. . గరివిడి లక్ష్మీగా ఆనంది నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రాశి మరో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో నటించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ రియల్ స్టోరీకి అద్భుతమైన స్పందన వస్తోంది.

గరివిడి లక్ష్మీ సినిమా షూటింగ్ లో ఆనంది..

కాగా ఆనంది సోక్రటిస్ అనే కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది. 2021 వరంగల్ లో వీరి వివాహం జరిగింది.

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us