AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే.. ఏడాది పొడవునా హాయిగా తినొచ్చు!

మీరు మునక్కాయలను కేవలం పప్పు, సాంబార్, కర్రీలలో మాత్రమే వాడుతున్నారు. అయితే కచ్చితంగా మీరు ఈ మునక్కాయల నిల్వ పచ్చడి గురించి తెలుసుకోవాల్సిందే.. నిమ్మకాయ, ఆవకాయ మాదిరి ఈ పచ్చడిని కూడా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే.. ఏడాది పొడవునా హాయిగా తినొచ్చు!
Homemade Drumstick Pickle Recipe
Anand T
|

Updated on: Oct 18, 2026 | 5:47 PM

Share

మునక్కాయలను చాలా మంది సాంబార్, కర్రీలలో మాత్రమే ఎక్కవగా వాడుతూ ఉంటారు. కానీ మునక్కాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుంటే నెలల తరబడి తినవచ్చు. అవును సంప్రదాయ ఆంధ్ర వంటకాలలో ఈ మునక్కాయ నిల్వ పచ్చడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పక్కా కొలతలతో మునక్కాలయతో పచ్చడి చేసుకుంటే.. ఆరు నెలల పాటు నిల్వ చేసుకొని తినవచ్చు. మరీ ఫర్ఫెక్ట్‌ రుచితో నెలల తరబడి తాజాగా ఉండేలా ఈ మునక్కాయల నిలువ పచ్చడిని ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

మునక్కాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు

  • మునక్కాయలు: 6 ముక్కలుగా కట్ చేసినవి
  • చింతపండు: 125 గ్రాములు
  • పసుపు: 1 టీస్పూన్
  • వేరుశనగ నూనె: 1.75 కప్పులు
  • ఆవాలు: 2.5 టేబుల్‌ స్పాన్,
  • మెంతులు: 2 టేబుల్ స్పూన్లు
  • కల్లుప్పు: 1/4 కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు : 50 గ్రాములు
  • కారం: 3/4 కప్పు
  • ఎండుమిర్చి: 5-6
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • ఇంగువ: 1/4 టీస్పూన్ (తాళింపు కోసం)

మునక్కాయ నిల్వ పచ్చడి తయారీ విధానం

మునక్కాయల తయారీ: మొదటగా కాస్త కండ ఎక్కువగా ఉన్న కొన్ని మునక్కాయలను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తడి లేకుండా తుడిచి, ఫ్యాన్ కింద అరగంట పాటు ఆరబెట్టాలి. తర్వాత, రెండు అంగుళాల పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మునక్కాయల పీచును తీయకండి. కట్ చేసిన తర్వాత ముక్కలు 500 గ్రాములు ఉండేలా చూసుకోండి.

చింతపండు గుజ్జు తయారీ: ఇప్పుడు 125 గ్రాముల చింతపండును ఒక కప్పు (250 మి.లీ) నీటిలో నానబెట్టాలి. తర్వాత, చింతపండును బాగా పిసికి చిక్కటి గుజ్జును తీసుకోవాలి. గుజ్జు తీసేటప్పుడు అవసరమైతే ఇంకోన్ని వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ పీచు, తుక్కు వేరు చేయాలి. ఈ చిక్కటి గుజ్జులో ఒక టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి బాగా కలిపి, చిన్న మంటపై 10-15 నిమిషాలు ఉడికించాలి. చింతపండులోని పచ్చిదనం పోయి గుజ్జు చిక్కగా మారే వరకు ఉడికించి చల్లారనివ్వాలి.

మెంతులు-ఆవాలు-ఉప్పు పొడి: ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి దోరగా, చిన్న మంటపై వేయించాలి. అవి చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోకి తీసుకుని, పావు కప్పు (70 గ్రాములు) ఎండబెట్టిన కల్లుప్పుతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. సాధారణ ఉప్పు ఉపయోగిస్తే 60 గ్రాములు సరిపోతుంది.

మునక్కాయలు, వెల్లుల్లి వేయించడం: ఇప్పుడు ఒక పాన్‌లో వేరుశనగ నూనె వేసి.. అది వేడెక్కిన తర్వాత, కట్ చేసిన మునక్కాయ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాలు మీడియం నుండి హై ఫ్లేమ్‌లో సగం వేయించాలి. అయితే వాటిని మరీ మాడిపోయే వేగించకండి.. కొద్దిగా మెత్తబడితే చాలు. ఆ తర్వాత 50 గ్రాముల తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి ఒక నిమిషం కదిపి, స్టవ్ ఆపి ముక్కలను నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.

తాళింపు తయారీ: ఇప్పుడు మునక్కాయలు వేయించిన నూనెను మళ్లీ వేడి చేసి, ఒకటిన్నర టీస్పూన్ ఆవాలు, ఐదు నుండి ఆరు ఎండుమిర్చి , రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి. స్టవ్ ఆపే ముందు పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి, ఈ తాళింపును పూర్తిగా చల్లారనివ్వాలి.

పచ్చడి కలపడం: ఇక చివరిగా అన్ని పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక పెద్ద గిన్నెలోకి వేయించిన మునక్కాయ ముక్కలు, వెల్లుల్లి, మెంతులు-ఆవాలు-ఉప్పు పొడి, ముప్పావు కప్పు, తగినంత కారం వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించి చల్లార్చిన చింతపండు గుజ్జు, చల్లారిన తాళింపు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. అంతే మునక్కాయల పచ్చడి రెడీ.. దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us