సమ్మర్ బరిలోకి దిగనున్న గోపీచంద్.. సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న హీరో.. డేట్ ఎప్పుడో చెప్పేసాడుగా..
హీరో గోపీచంద్‌తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం ‘సీటీమార్’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా
హీరో గోపీచంద్‌తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం ‘సీటీమార్’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్‌లు తమ సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేయగా.. తాజాగా హీరో గోపీచంద్ కూడా తన సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు.
‘సీటీమార్’ సమ్మర్లో ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా గోపీచంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా విడుదలతేదీతోపాటు గోపీచంద్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. అందులో సీరియస్ లుక్‌లో చేతిలో పెద్ద సుత్తి పట్టుకోని కూర్చున్నాడు గోపీచంద్. ఆంధ్రా టీం ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా గోపీచంద్ నటిస్తుండగా… తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా తమన్నా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తమన్నాతోపాటు హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తున్నట్లుగా టాక్. అలాగే సీనియర్ నటి భూమిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
#Seetimaar is coming to you on April 2nd!! ?#SeetimaarrOnApril2@tamannaahspeaks @IamSampathNandi @SS_Screens @bhumikachawlat @DiganganaS @actorrahman @soundar16 #ManiSharma pic.twitter.com/ZvFgxVVeST
— Gopichand (@YoursGopichand) January 28, 2021
Also Read: