కీర్తి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ రెడీ

నగేష్ కుకునూర్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన చిత్రం గుడ్‌లక్‌ సఖి. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి షూటర్‌గా నటించింది.

కీర్తి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. 'గుడ్‌లక్ సఖి' టీజర్‌ రెడీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 5:47 PM

Keerthy Suresh GoodLuck Sakhi: నగేష్ కుకునూర్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన చిత్రం గుడ్‌లక్‌ సఖి. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి షూటర్‌గా నటించింది. ఒక షెడ్యూల్‌ మినహా ఈ మూవీ షూటింగ్‌ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి కీర్తి అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది చిత్ర యూనిట్‌. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్‌ ఆగష్టు 15న విడుదల కాబోతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. మూడు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి నటించిన మరో మహిళా ఓరియెంటెడ్ చిత్రం కావడం, జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించడం, జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించడం, డీఎస్పీ, చిరంతన్, దిల్ రాజు భాగం అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

స్వర్ణా ప్యాలెస్‌‌ అగ్ని ప్రమాదం: వెలుగులోకి రమేష్ ఆసుపత్రి అక్రమాలు

షాకిచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు‌.. చూస్తే మీరు షాక్ అవుతారు!