Shraddha Arya: నేవీ అధికారితో ఏడడుగులు నడిచిన ‘గొడవ’ ముద్దుగుమ్మ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

'గొడవ' సినిమాతో తెలుగు సినీ ప్రియులను గిలిగింతలు పెట్టింది శ్రద్ధా ఆర్య. వైభవ్‌ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

Shraddha Arya: నేవీ అధికారితో ఏడడుగులు నడిచిన 'గొడవ' ముద్దుగుమ్మ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2021 | 6:57 AM

‘గొడవ’ సినిమాతో తెలుగు సినీ ప్రియులను గిలిగింతలు పెట్టింది శ్రద్ధా ఆర్య. వైభవ్‌ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆతర్వాత ‘కోతిమూక’, ‘రోమియో’ చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. వీటితో పాటు తమిళ, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ సత్తాచాటింది. ఆ తర్వాత ‘కుంకుమ భాగ్య’, ‘కుండలి భాగ్య’ సీరియల్స్‌తో బుల్లితెరపై కూడా తన అభినయ ప్రతిభను చాటుకుంది. ఇలా సిల్వర్‌ స్ర్కీన్‌, స్మాల్‌ స్ర్కీన్‌పై అలరించిన ఈ అందాల తార తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఢిల్లీకి చెందిన నావికాదళ అధికారి రాహుల్‌ శర్మతో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. ఢిల్లీలో జరిగిన ఈ పెళ్లి గురించి వధూవరులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వివాహ వేడుక అనంతరం శ్రద్ధ ఫొటోలను షేర్‌ చేయడం, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం తెలిసింది.

‘మే ల‌క్ష్మీ తేరే అంగాన్ కీ’, ‘తుమ్హారీ పాఖీ’, ‘డ్రీమ్ గ‌ర్ల్’ వంటి ధారావాహిక‌లతో పాటు ‘నచ్‌ బలియే’ లాంటి రియాలిటీ షోలు, పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రద్ధ. 2015లో జయంత్‌ రెట్టి అనే ఓ ఎన్నారైతో ఆమెకు నిశ్చితార్థం జ‌రిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. తాజాగా రాహుల్‌శర్మతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వివాహ వేడుకకు ‘కుండ‌లీ భాగ్య’ ఫేమ్‌ అంజుమ్ ఫ‌ఖీ, సుప్రియ శుక్లా ‘బాలికా వ‌ధు’ న‌టుడు శశాంక్ వ్యాస్ స‌హా త‌దిత‌రులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం శ్రద్ధ పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:

Venkatesh: నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకీ మామా..

Buchi Babu Sana : ఉప్పెన డైరెక్టర్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చినట్టేనా.. ఆ స్టార్ హీరోతోనే బుచ్చిబాబు సినిమా..?

Sreemukhi: ట్రెండీ డ్రెస్‏లో అదిరిపోయిన శ్రీముఖి.. ఈ అందాల యాంకరమ్మకు సాటి లేరెవ్వరూ.!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!