AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia: నువ్వు లేకపోతే నేను లేనంటోన్న ‘బొమ్మరిల్లు హాసిని’… పెళ్లి రోజున ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన బ్యూటీ..

Genelia Instagram Post: 'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక...

Genelia: నువ్వు లేకపోతే నేను లేనంటోన్న 'బొమ్మరిల్లు హాసిని'... పెళ్లి రోజున ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన బ్యూటీ..
Narender Vaitla
| Edited By: |

Updated on: Feb 04, 2021 | 6:37 AM

Share

Genelia Instagram Post: ‘సత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుందీ బ్యూటీ. వివాహం తర్వాత సినిమాలకూ దూరంగా ఉంటూ వస్తోన్న జెనిలీయా వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌గా కనిపిస్తుంటారు. ఇక జెనిలీయా కూడా తన భర్తపై ఉన్న ప్రేమను బహిరంగానే వ్యక్తపరుస్తుంటుంది. సోషల్‌ మీడియా వేదికగా తన భర్త ఫొటోలను పోస్ట్‌ చేసే జెనీలియా తాజాగా తమ వివాహ వార్షికోత్సం (ఫిబ్రవరి3) సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. భర్తపై వాలిపోతూ తన ప్రేమను వ్యక్తపరుస్తోన్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్‌ చేసిన జెనీలియా.. ‘నువ్వు లేకుండా నేను లేను. నేను నీ ప్రేమలో పూర్తిగా మునిగిపోయాను. నా ప్రియమైన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఇక మరో పోస్టులో మ్యారేజ్‌ డే సందర్భంగా చేసిన క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

Also Read: ‘పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని.. మద్యం తాగడం వల్లే బరువు పెరిగా’ అన్నారు.. అసలు నిజం చెబుతున్న హాట్ బ్యూటీ..