AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vignesh Shivan: ప్రతి ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే..! నయన్ ఎక్కడుంటే.. అదే నా బెస్ట్ ప్లేస్: విఘ్నేశ్ శివన్

సౌత్ ఇండియన్ బ్యూటీ నయనతార ప్రియుడిగా పాపులర్ అయిన విఘ్నేశ్ శివన్.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాడు. దర్శకుడిగా, పాటల రచయితగానే కాక నిర్మాతగాను మంచి పేరు సంపాధించుకోవడంతోపాటు ఎన్నో విజయాలు అందుకున్నాడు.

Vignesh Shivan: ప్రతి ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే..! నయన్ ఎక్కడుంటే.. అదే నా బెస్ట్ ప్లేస్: విఘ్నేశ్ శివన్
Vignesh Shivan And Nayanthara
Venkata Chari
|

Updated on: Jun 28, 2021 | 6:41 PM

Share

Vignesh Shivan: సౌత్ ఇండియన్ బ్యూటీ నయనతార ప్రియుడిగా పాపులర్ అయిన విఘ్నేశ్ శివన్.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాడు. దర్శకుడిగా, పాటల రచయితగానే కాక నిర్మాతగాను మంచి పేరు సంపాధించుకోవడంతోపాటు ఎన్నో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, నయన తార వంటి అగ్రశ్రేణి నటులతో ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. దీంతో అభిమానులు ఆయనకు వింత వింత ప్రశ్నలు సంధించారు. ఇందులో ఓ నెటిజన్ మరికాస్త ముందుకేసి.. నయనతార విషయం అడిగేశాడు. మిమ్మల్ని ఎప్పుడూ నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటుంటారు కదా మీకేమనిపిస్తోందని అడిగేశాడు. దీంతో విఘ్నేశ్ శివన్ కూడా అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చేశాడు. చాలా గొప్పగా ఉందంటూ నెటిజన్ కి షాక్ ఇచ్చాడు.

మరో నెటిజన్.. కొందరు స్క్రిప్ట్ రాసేందుకు ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటారు. పాటలు రాసేందుకూ కొన్ని ప్రత్యేక ప్రదేశాలు సెలక్ట్ చేసుకుంటుంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లి పాటలు, స్టోరీలు రాస్తారు అని అడిగాడు. అందుకు ఆయన చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చేశాడు. ప్రతి ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే.. అక్కడే అంతా మొదలవుతుందని చెప్పేశాడు. అలాగే నేనేమీ బాత్రూం సింగర్‌ని కాదని.. కానీ, బాత్రూం రైటర్ అని కామెంట్ చేశాడు. దీంతో షాకవ్వడం అభిమానులవంతైంది. మీకు ఇష్టమైన ప్లేస్ ఏదని ఓ నెటిజన్ అడగగా, నయనతార ఎక్కడున్నా సరే.. అది నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా మారిపోతుందని వెల్లడించాడు. ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు సంధించినా.. విసుగుపడకుండా సమాధానాలు ఇచ్చాడు నయన్ ప్రియుడు.

మరోవైపు, చీరలో నయనతార ఎంతో అందంగా ఉంటుందని, ఆమెను చీరలో చూడడం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో గడిపే ప్రతీ క్షణం, ప్రతీ ప్లేస్ తనకు చాలా నచ్చుతాయని విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. పెళ్లి అనేది ఎంతో ఖరీదైనదని, అందుకే, ప్రస్తుతం తాను పెళ్లి కోసం డబ్బు దాచి పెడుతున్నానని ఆయన పేర్కొన్నాడు. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక నయనతార, నేను పెళ్లి చేసుకుంటామని చెప్పి.. వారి పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.

Also Read:

OTT Movies: ఈ వారం కనువిందు చేయనున్న సినిమాలు… ఓటీటీలో విడుదలయ్యే ప్రాజెక్ట్స్ ఇవే..

Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..

Ankita Lokhande: బిగ్‏బాస్‏లోకి అంకిత లోఖండే.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి..