AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora Fatehi: పుట్టినరోజున అదిరిపోయే బహుమతి అందించిన అభిమానులు.. భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ బ్యూటీ..

బాలీవుడ్‌ లో స్పెషల్‌ సాంగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నోరా ఫతేహి (Nora Fatehi) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

Nora Fatehi: పుట్టినరోజున అదిరిపోయే బహుమతి అందించిన అభిమానులు.. భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ బ్యూటీ..
Nora Fatehi
Basha Shek
|

Updated on: Feb 08, 2022 | 2:22 PM

Share

బాలీవుడ్‌ లో స్పెషల్‌ సాంగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నోరా ఫతేహి (Nora Fatehi) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమా ‘ఇట్టాగే రెచ్చిపోనా’ పాటతో మొదటిసారి టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిన ఈ అందాల తార.. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ (Manohari) పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంది. ‘కిక్‌2’, ‘షేర్‌’ ‘లోఫర్‌’, ‘ఊపిరి’ సినిమాల్లోని పాటలకు కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అలరించింది. పలు టీవీ షోలు, డ్యాన్స్‌ రియాలిటీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ఈ అమ్మడికి సోషల్‌ మీడియా బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె పేరుమీద పలు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. సందర్భమొచ్చినప్పుడల్లా వారు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా నోరా (Nora Birthday) పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఫ్యాన్స్ వినూత్న రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

300 మంది అనాథ పిల్లలకు అన్నదానం.. నోరా పేరుపై కొనసాగుతోన్న నోరా ఫతేహీ లవ్, టీమ్ నోరా ఫతేహీ, షేడ్స్ ఆఫ్ నోరా, నోరా ఫతేహీ ఫ్యాన్ ఇంగ్లండ్, నోరా ఫతేహీ మాఫియా, నోరా ఫతేహీ ఇండియా క్లబ్‌లన్నీ ఇటీవల నోరా పేరిట అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టాయి. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సుమారు 300 మంది పేద పిల్లలకు అన్నదానం ఏర్పాటుచేశారు. అంతేకాదు అన్నదానం అనంతరం చిన్నారులతో నోరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో నోరాకి చేరింది. దీన్ని చూసిన ఆమె భావోద్వేగానికి గురైంది. ‘ఇది చూసిన తర్వాత ఆనందంతో నా కళ్లు చెమర్చాయి. నేను ఇప్పటివరకు అందుకున్న బహుమతుల్లో ఇదే అత్యుత్తమం. నా అభిమాన సంఘాలన్నీ ఒకచోట చేరి, నా పేరు మీద చాలా మంది నిరుపేద పిల్లలకు అన్నదానం నిర్వహించినందుకు ధన్యావాదాలు. ఈ అద్భుతమైన, అమూల్యమైన బహుమతి అందించినందుకు థ్యాంక్స్‌. ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది నోరా. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారింది. నోరాఅభిమానులు చేసిన మంచి పనికి నెటిజన్లు ముగ్ధు్లవుతున్నారు.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

Also Read:Covid End: తెలంగాణ‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింది.. ఎలాంటి ఆంక్షలు లేవు.. కీలక ప్రకటన చేసిన డీహెచ్ శ్రీనివాస్

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..