AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime news: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. పొలాల్లోకి తీసుకెళ్లి.. ఆపై..??

ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించిన ఓ దుండగుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్రమత్తమైన బాధితురాలు బైక్ పై నుంచి దూకి, రక్షించండి అంటూ అరుస్తూ పరుగులు తీసింది....

AP Crime news: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. పొలాల్లోకి తీసుకెళ్లి.. ఆపై..??
Bike Lift
Ganesh Mudavath
|

Updated on: Feb 08, 2022 | 1:55 PM

Share

ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించిన ఓ దుండగుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్రమత్తమైన బాధితురాలు బైక్ పై నుంచి దూకి, రక్షించండి అంటూ అరుస్తూ పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ దుండగుడు ఆ మహిళను వెంబడిస్తూ పొలాల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆ మార్గంలో వస్తున్న వారి సహకారంతో బయటపడిన బాధితురాలు నేరుగా పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు(Pedakurapadu)లో జరిగింది. సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ.. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో జరిగే బంధువు దశదిన కర్మకు వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమైంది. అర్ధ గంట వరకు ఎదురు చూసినప్పటికీ.. వాహనాలు రాలేదు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పెదకూరపాడుకు తీసుకువెళ్తానని నమ్మించి, ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు.

పెదకూరపాడుకు వచ్చేందుకు రెండు మార్గాలు ఉండటంతో జనసంచారం లేని మార్గంలో తీసుకువెళ్లాడు. అనుమానంతో మహిళ ప్రశ్నించగా.. ఈ దారిలో వెళితే గమ్యం దగ్గర అవుతుందని నమ్మించాడు. అంతేకాకుండా ప్రయాణంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే బైక్ పై నుంచి దూకి పాటిబండ్ల వైపు పరుగులు తీసింది. వెంబడించిన దుండగుడు మహిళను పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అటుగా వస్తున్న వారు అప్రమత్తమయ్యారు. వారి సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఘటన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ వాంగ్మూలాన్ని రికార్డు చేసి కేసు నమోదు చేశారు.

Also Read

Farmer Murder: ప్రాణం తీసిన భూ తగాదా.. వృద్ధుడని కూడా చూడకండా…

Black Magic: వణుకు పుట్టిస్తున్న క్షుద్రపూజలు.. ఇంట్లో గుంతలు తవ్వి.. పసుపు కుంకుమలు చల్లి..

 Siddipet Firing case: జల్సాలకు బానిసై.. పోలీసులకు చిక్కి.. చివరికి.. ??