AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth).. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగి అదే క్రేజ్‌తో బిగ్‌బాస్  (bigg boss) ఇంట్లో అడుగుపెట్టాడు.

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Basha Shek
|

Updated on: Feb 08, 2022 | 2:01 PM

Share

షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth).. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగి అదే క్రేజ్‌తో బిగ్‌బాస్  (bigg boss) ఇంట్లో అడుగుపెట్టాడు. ప్రారంభం నుంచి టైటిల్‌ ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో సిరితో వ్యవహారం, ఆతర్వాత దీప్తి సునయన (Deepthi Sunaina)  బ్రేకప్‌ విషయాలతో వార్తల్లో నిలిచిన షణ్ముక్‌ ఇప్పుడు మళ్లీ తన నటన వైపు దృష్టి సారిస్తున్నాడు. త్వరలోనే ఓ కొత్త వెబ్‌సిరీస్‌తో మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఈ యూట్యూబ్‌ స్టార్‌ తాజాగా కొత్త ఇల్లును కొన్నాడు. గృహప్రవేశం కూడా పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు అతనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.

కాగా ఈ గృహ ప్రవేశం కార్యక్రమాల్లో షణ్ముఖ్‌ వెంట నటి, ఛాయ్‌ బిస్కెట్‌ ఫేం శ్రీ విద్య కూడా ఉంది. కాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టిన షణ్నూకి అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీప్తితో బ్రేకప్‌ తర్వాత క్రమంగా ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు షణ్ముఖ్‌. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యెక్రమంలో అతను పాల్గొన్నాడు. అందులో భాగంగా లవ్‌, బ్రేకప్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆర్య-2 సినిమాలోని ‘మై లవ్‌ ఈజ్‌ గాన్‌’ అనే పాటకు అద్భుతంగా స్టెప్పులేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది.

Also Read:AP Crime news: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. పొలాల్లోకి తీసుకెళ్లి.. ఆపై..??

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..

Gudivada Casino: ఢిల్లీకి చేరిన గుడివాడ క్యాసినో వ్యవహారం.. ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు