వరుసగా 7 ఫ్లాపులు.. అయినా చేతిలో మూడు సినిమాలు.. ఈ అమ్మడి క్రేజే వేరు
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులారిటీ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ఎంతో మంది సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ అందుకోలేకపోతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం పీక్స్..

హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కసారి హీరోయిన్ గా చేసిన తర్వాత హీరోయిన్ గా రాణించడం అనేది కత్తిమీద సాములాంటిది. వరుస అవకాశాలు అందుకోవడం ఒకెత్తు.. సక్సెస్ లు అందుకోవడం మరొకెత్తు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం అవకాశాలు అందుకున్నా సక్సెస్ లు మాత్రం అంతగా అందుకోలేకపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇంకొంతమంది వరుసగా అవకాశాలు అందుకున్నా హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మడు ఒకరు. ఆమె ఎంతో మంది అభిమాన తార. తన నటనతో పాటు గ్లామర్‌తోనూ కవ్వించింది.. కానీ సక్సెస్ లు మాత్రం అంతగా లేవు.. ఇంతకూ ఆమె ఎవరంటే..
అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది అందాల భామ పూజా హెగ్డే. తమిళ్‌లో జీవ నటించిన మాస్క్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బడా హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు రీసెంట్ లో వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటుంది.
మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన
పూజా రీసెంట్ గా ఏ సినిమాలో నటించినా అవి ఫ్లాప్స్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినా అవేమి ఈ బ్యూటీకి కలిసిరాలేదు.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే స్పెషల్ సాంగ్స్ లోకి అడుగుపెట్టింది. సాంగ్స్ హిట్ అయ్యాయి కానీ ఆ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. చివరిగా పూజా నటించిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్, హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై, అలాగే తమిళ్‌లో కాంచన 4 సినిమాల్లో నటిస్తుంది.
చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.








