AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీరాజా హీరోగా పరిచయం చేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. తెలుగులో తోపు కమెడియన్.. ఎవరంటే..

దర్శకుడు భారతీరాజా మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలో ఒక లెజెండ్ ను కోల్పోయిందంటూ సినీ రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అలాగే భారతీరాజాకు తెలుగు చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే కథలను అందించారు. ఆయన హీరోగా పరిచయం చేసిన ఓ నటుడు ఆ తర్వాత సహయ నటుడిగా, విలన్ గా, హాస్య నటుడిగా మెప్పించారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ?

భారతీరాజా హీరోగా పరిచయం చేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. తెలుగులో తోపు కమెడియన్.. ఎవరంటే..
Bharathiraja
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2026 | 4:24 PM

Share

తమిళ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే మీకు తెలుసా.. ? డైరెక్టర్ భారతీరాజా హీరోగా పరిచయం చేసిన ఒక నటుడు ఆ తర్వాత తెలుగులో ఫేమస్ కమెడియన్ గా రాణించారు. సహయ నటుడిగా, ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. ఆయన మరెవరో కాదు.. కమెడియన్ సుధాకర్. ఒకప్పుడు తెలుగులో తోపు నటుడు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సుధాకర్ భారతిరాజా దర్శకత్వం వహించిన ‘కిజిష్కాకే పోగుం రైల్’ తూర్పు వెళ్లే రైలు సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

1970వ దశకం చివర్లో విడుదలైన ‘కెజాకే పోగుమ్ రైల్’ సినిమా సుధాకర్ సినీ కెరీర్‌లో పెద్ద మలుపు. పల్లెటూరి నేపథ్యానికి తగ్గట్టు అతని నటన సినిమాకి ఎమోషనల్ పవర్‌ని పెంచింది. ఈ చిత్రం ఒక సంవత్సరానికి పైగా థియేటర్లలో ప్రదర్శించారు. అలాగే అనేక భాషలలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సుధాకర్ తమిళ సినిమా యువ కథానాయకులలో ఒకరిగా ఎదిగారు. ‘మణిధారిల్ ఇత్తని నిరంగల’, ‘ఇనికుం ఇలమై’, ‘మంతోప్పు కిలియే’, ‘పొన్ను ఊరుకు పుదుసు’, ‘నిరం మరత పూక్కల్’, ‘సువర్ ఇల్లా చిత్రంగ్’, ‘ఎంగా ఊరు రాసతి’, ‘ఒరుతి మతం’ వంటి విజయవంతమైన చిత్రాలలో ఆయన హీరోగా నటించి మెప్పించారు.

1990ల ప్రారంభంలో సినిమా ట్రెండ్ మారడంతో, హీరో అవకాశాలు తగ్గిపోవడం మొదలయ్యాయి. దాంతో సుధాకర్ సహాయ పాత్రలు, హాస్య పాత్రలపై దృష్టి సారించారు. భారతీరాజా మృతిపై సుధాకర్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. “నా మొదటి సినిమా ‘కెళఖే పోగుం రైల్’ ద్వారా భారతిరాజా సార్ నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేను ‘నిరం మారత పూక్కల్’, ‘కెళఖే పోగుం రైల్’, ‘కల్లకుల్ ఈరం’ వంటి తమిళ చిత్రాలలో సుమారు 15 నుంచి 20 చిత్రాలలో నటించాను. నాకు జీవితాన్ని ఇచ్చిన భారతిరాజా మరణం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను,” అని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. చాలా కాలంగా సుధాకర్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

సుధాకర్ పోస్ట్..

View this post on Instagram

A post shared by G Sudhakar (@sudhakarreal)

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us