వార్ని.. ఈ పాటలన్ని పాడింది తారక్ అని మీకు తెలుసా..? ఎన్టీఆర్‌తో మాములుగా ఉండదు మరీ..!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్, సెలబ్రెటీలు

యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. తారక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు, పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అలాగే తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రతిఒక్కరికి తెలుసు.. ఆయన పేరు చెప్పినా.. తెరపై ఆయన కనిపించినా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. తన నటనతో, డాన్స్ లతో డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. జపాన్ లోనూ తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఈ తరంలో తారక్ లా డైలాగ్ చెప్పే నటుడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. ఎంతటి కష్టమైన డైలాగ్ నైనా ఇట్టే.. ఒక్క టెక్ లోనే చెప్పే నటుడు తారక్.
ఇది కూడా చదవండి :పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి.. స్టార్ హీరోలకు మించి బిజీ హీరోయిన్
నటుడిగానే కాదు ఎన్టీఆర్ సింగర్ గాను అలరించారు. కొన్ని సినిమాల్లోనూ ఆయన తన వాయిస్ ను వినిపించారు. అసలు తారక్ మొత్తం ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా..? తారక్ ఇప్పటివరకు ఆరు సినిమాల్లో తన వాయిస్ వినిపించారు. దర్శక ధీరుడు రాజమౌళ తెరకెక్కించిన యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా.. అనే పాట ఎన్టీఆర్ పాడారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆతర్వాత మణిశర్మ సంగీతం అందించిన కంత్రి సినిమాలో టైటిల్ ట్రాక్ పాడారు ఎన్టీఆర్. అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చేత ఓ పాట పాడించారు. సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇది కూడా చదవండి : Jayasudha: ఆ ఒక్క హీరోతో ఏకంగా 31 సినిమాల్లో నటించిన జయసుధ.. అన్ని హిట్లే
రభస అనే సినిమాలో తమన్ సంగీత సారథ్యంలో అచ్చతెలుగు ఆడపిల్లలా.. అనే పాటను పాడారు ఎన్టీఆర్. ఇక మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఫాలో ఫాలో.. సాంగ్ పాడారు ఎన్టీఆర్. తెలుగులోనే కాదు కన్నడ భాషలోనూ ఓ పాట పాడారు తారక్. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలోనూ ఎన్టీఆర్ సాంగ్ పాడారు. ఇలా సింగర్ గాను తారక్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే డ్రాగన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.
