Watch : ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఫన్నీ రనౌట్.. మొహసిన్ ఖాన్ బ్లండర్.. తలపట్టుకున్న లక్నో కెప్టెన్
Watch : ధ్రువ్ జురెల్ ఆడిన షాట్‌ను లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ అద్భుతంగా ఆపి, వెంటనే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ మొహసిన్ ఖాన్‌కు బంతిని విసిరాడు. అప్పటికే క్రీజు వదిలి సగం దూరం వచ్చేసిన వైభవ్ సూర్యవంశీ, వెనక్కి వెళ్లే అవకాశం లేక ఆశలు వదిలేసుకున్నాడు.

Watch : ఐపీఎల్లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే, ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన రికార్డుతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నవ్వులు పూయించిన ఒక కామెడీ రనౌట్ మిస్‌కు కూడా సాక్ష్యంగా నిలిచింది. లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ చేసిన ఈ ఘోర తప్పిదం, గతంలో 2009లో డెక్కన్ చార్జర్స్‌పై సీఎస్‌కే ప్లేయర్ షాదాబ్ జకాతీ చేసిన రనౌట్ బ్లండర్‌ను గుర్తుచేసింది. వికెట్ల పక్కనే ఉండి కూడా మొహసిన్ ఖాన్ రనౌట్ చేయలేకపోవడంతో స్టేడియంలోని వారంతా నోరెళ్లబెట్టారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా కేవలం 15 ఏళ్ల వయసున్న రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి కేవలం 38 బంతుల్లోనే 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ తుఫాన్ బ్యాటింగే ఇరు జట్ల మధ్య గెలుపోటములను శాసించింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ మొదటి బంతి నవ్వులు పూయించింది. ధ్రువ్ జురెల్ ఆడిన షాట్‌ను లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ అద్భుతంగా ఆపి, వెంటనే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ మొహసిన్ ఖాన్‌కు బంతిని విసిరాడు. అప్పటికే క్రీజు వదిలి సగం దూరం వచ్చేసిన వైభవ్ సూర్యవంశీ, వెనక్కి వెళ్లే అవకాశం లేక ఆశలు వదిలేసుకున్నాడు. మొహసిన్ ఖాన్ వికెట్ల ముందే నిలబడి ఉన్నాడు, కేవలం బంతితో వికెట్లను తాకిస్తే చాలు రనౌట్ అయిపోయేది. కానీ అక్కడే మొహసిన్ ఖాన్‌కు మైండ్ బ్లాక్ అయింది. వికెట్లను నేరుగా తాకించకుండా.. పక్కనే ఉండి వికెట్లపైకి బంతిని గాల్లోకి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ బంతి వికెట్లకు తగలకుండా పక్కనుంచి వెళ్ళిపోయింది. దాంతో వైభవ్ నవ్వుకుంటూ చాలా ఈజీగా క్రీజులోకి చేరుకున్నాడు.
Just when we thought we’d seen it all 😅
🎥 How has that evaded the stumps? 😮
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS
— IndianPremierLeague (@IPL) May 19, 2026
ఈ ఘోరమైన రనౌట్ మిస్ అయినప్పటికీ, మొహసిన్ ఖాన్ ఏమాత్రం సహనం కోల్పోకుండా అదే ఓవర్లో తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఆ 14వ ఓవర్ ఆఖరి బంతికి (6వ బంతి) ఆఫ్‌స్టంప్ అవతల ఒక పక్కా ప్లానింగ్‌తో స్లోయర్ డెలివరీ వేశాడు. దానిని భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ.. లాంగ్-ఆన్‌లో ఉన్న అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అలా 93 పరుగుల వద్ద వైభవ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ ఐపీఎల్ సీజన్ లో మొహసిన్ ఖాన్ 6 ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాపై 5 వికెట్ల హాల్ తీసిన ఏకైక బౌలర్ కూడా ఇతనే. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసి విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
