Adi Reddy : రివ్యూపై ఆదిరెడ్డి ఎంత సంపాదించాడో తెలుసా.. ? బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ..
బిగ్బాస్ సీజన్ 9 ముగిసింది. ఈ సారి విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల దాదాపు రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అయితే మీకు తెలుసా.. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే యూట్యూబర్ ఆదిరెడ్డి ఇప్పటివరకు ఎంత సంపాదించారో గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక్క సీజన్ కు కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదిరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి సుపరిచితమే. ముఖ్యంగా బిగ్ బాస్ లవర్స్ ఎక్కువగా ఫాలో అయ్యే రివ్యూవర్. బిగ్ బాస్ షో గురించి.. కంటెస్టెంట్స్ ఆట గురించి ఆదిరెడ్డి చెప్పే రివ్యూకు సెపరేట్ ఫ్యాన్స్ సైతం ఉన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిరెడ్డి రివ్యూస్ పై తాను ఎంత సంపాదించాను.. ? అసలు యూట్యూబర్ తన ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యిందనే విషయాలు? పంచుకున్నారు. తాను తీవ్రమైన ఆర్థిక సమస్యలు, తల్లి ఆత్మహత్య వంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొన్నానని ఆది రెడ్డి వెల్లడించారు. నెలకు కేవలం రూ. 12,000-14,000 సంపాదించే స్థితి నుండి, యూట్యూబ్ ద్వారా మొదటి సంవత్సరం రూ. 70,000, ఆ తర్వాత రూ. 1,80,000, చివరకు నెలకు రూ. 39 లక్షల వరకు సంపాదించానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన తన విజయం ద్వారా సుమారు 80 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఓ తన యూట్యూబ్ ఆదాయం గురించి, తన జీవిత ప్రయాణం గురించి అనేక విషయాలు పంచుకున్నారు.. ఒక బిగ్ బాస్ రివ్యూయర్, కంటెస్టెంట్, వ్యాపారవేత్తగా తన విజయాల వెనుక దాగి ఉన్న కఠినమైన రోజుల గురించి వెల్లడించారు.. లక్ కంటే జీవితంలో ఒక సమయం వస్తుందని, ఆ సమయంలో ఎవరు ఆపలేరని అన్నారు.. తనకు బిగ్ బాస్ రివ్యూలు చేయడం ఒక మలుపు అని తెలిపారు. 2018లో సీజన్ 2 బిగ్ బాస్ రివ్యూలు చేయడం ద్వారా యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. అంతకుముందు తీవ్రమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత విషాదాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినప్పటికీ, సింధనూర్ గ్రామంలో సివిల్ ఇంజనీర్ గా నెలకు రూ. 12,000 నుండి 14,000 మాత్రమే సంపాదించేవారని వెల్లడించారు. ఆ రోజుల్లో తమ కుటుంబం రూ. 11 లక్షలకు పైగా బ్యాంకు లోన్స్ తో ఇబ్బందిపడ్డామని . తన చెల్లి చూపులేనిదని, తల్లి ఆత్మహత్య చేసుకోవడం వంటివి తీవ్ర సమస్యలు ఉండేవని తెలిపారు.
30 ఏళ్ల వరకు పెళ్లి కూడా చేసుకోలేని పరిస్థితి ఉండేదని, 48-50 కిలోల బరువుతో, 6.3 అడుగుల ఎత్తుతో ఉన్న తనను ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో తన మానసిక ఒత్తిడి పెరిగిందని.. అప్పుడే సరదాగా బిగ్ బాస్ రివ్యూలు చేయడం మొదలుపెట్టానని చెప్పారు. మొదట రైతుల సమస్యలపై వీడియోలు చేసినా అవి ఆదరణ పొందలేదని, బిగ్ బాస్ రివ్యూలు మాత్రం విజయవంతమయ్యాయని వివరించారు. యూట్యూబ్ ఛానెల్ ను మానిటైజ్ చేసిన తర్వాత, మొదటి సంవత్సరంలో రూ. 70,000, ఆ తర్వాత రూ. 1,80,000 సంపాదించారని, చివరికి ఒక నెలలో రూ. 39 లక్షల ఆదాయం వరకు చేరిందని తెలిపారు. ఈ విజయం ద్వారా ప్రస్తుతం తాను సెలూన్ వ్యాపారంలో 20 మందికి, తన చుట్టూ ఉన్న ఐదు, ఆరుగురు వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నానని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే వారికి తన జీవితమే ఒక ఉదాహరణ అని, ఎన్ని కష్టాలు ఉన్నా ఆశ వదులుకోకుండా ఎదురుచూస్తే విజయం తప్పక వస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..
