AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: ఆ హీరోతో సినిమా చేయడం నా డ్రీమ్ అంటున్న రాజమౌళి.. అయితే రెండు కండీషన్స్ ఉన్నాయట..

SS Rajamouli: ఎంత పెద్ద దర్శకుడైనా.. హీరో క్రేజ్ ముందు బలాదూర్ అంటారు. కానీ అది తప్పని నిరూపించారు రాజమౌళి. ఈయన పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. హీరో ఎవరని కూడా అడక్కుండా థియేటర్స్‌కు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు.

SS Rajamouli: ఆ హీరోతో సినిమా చేయడం నా డ్రీమ్ అంటున్న రాజమౌళి.. అయితే రెండు కండీషన్స్ ఉన్నాయట..
SS Rajamouli
Janardhan Veluru
|

Updated on: Aug 25, 2022 | 5:30 PM

Share

SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి అడగాలే కానీ ఇండియాలో ఏ హీరో కూడా కాదనకుండా డేట్స్ ఇస్తారు. ఏ హీరోను అడిగినా కూడా.. మాకు రాజమౌళితో పని చేయాలని ఉందని చెప్తుంటారు. మరి అలాంటి దర్శకుడికి ఏ హీరోతో పని చేయాలని ఉంది..? ఆయనకు ఎవర్ని డైరెక్ట్ చేయాలని ఉంది..? జక్కన్న మనసులో ఉన్న మాస్ హీరో ఎవరు..? ఎవరితో సినిమా చేయాలని రాజమౌళి బాగా కోరుకుంటున్నారు..? దానికి సమాధానం వచ్చిందిప్పుడు.

ఎంత పెద్ద దర్శకుడైనా.. హీరో క్రేజ్ ముందు బలాదూర్ అంటారు. కానీ అది తప్పని నిరూపించారు రాజమౌళి. ఈయన పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. హీరో ఎవరని కూడా అడక్కుండా థియేటర్స్‌కు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నారు జక్కన్న. ఈయన ఊ అనాలే కానీ నో అనే హీరోనే లేడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో..! అలాంటి దర్శక ధీరుడికి కూడా ఓ హీరోతో పని చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది.

ప్రతీ దర్శకుడికి కచ్చితంగా ఏదో ఓ హీరోతో పని చేయాలనే కోరిక మాత్రం బలంగా ఉంటుంది. దానికి రాజమౌళి కూడా మినహాయింపేమీ కాదు. తాజాగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు జక్కన్న. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. సౌత్ భాషల్లో బ్రహ్మస్త్రను రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 9న విడుదల కానుంది ఈ చిత్రం.

ఇవి కూడా చదవండి

చెన్నైలో బ్రహ్మస్త్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళికి.. అక్కడి మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు తమిళంలో ఏ హీరోతో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగితే.. వెంటనే రజినీకాంత్ (Rajinikanth) పేరు చెప్పారు జక్కన్న. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయాలనే కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయనతో వర్క్ చేయడం డ్రీమ్ అన్నారు జక్కన్న. అయితే దీనికి సరైన టైమ్, కథ అవసరమని కామెంట్ చేశారు. ఈ రెండూ ఓకే అయితే రజనీకాంత్‌తో సినిమా చేయొచ్చన్నారు.

Rajinikanth

Rajinikanth

రజినీకాంత్, రాజమౌళి కాంబినేషన్ కలవాలని అభిమానులు కూడా చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. కానీ జక్కన్న చేసే సబ్జెక్టులకు రజినీకాంత్‌తో వర్కవుట్ అవ్వడం కష్టమే. కానీ ఇప్పుడు రాజమౌళే స్వయంగా రజినీని డైరెక్ట్ చేయాలని ఉందని చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేనా..? ఒకవేళ అయితే మాత్రం.. అంతకంటే పెద్ద సెన్సేషన్ ఇండియన్ సినిమాలో మరోటి ఉండదేమో..?

మరిన్ని సినిమా వార్తలు చదవండి..