Rajamouli: రొమాంటిక్ బాలేదంటే.. ముసలోడివై పోయావ్ నీకేం తెలుసు అంటారని భయంగా ఉంది.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
Rajamouli: పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. అనిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 29 (శుక్రవారం) విడుదల చేయనున్నారు..
Rajamouli: పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. అనిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 29 (శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా మూవీ ప్రీమియర్ షోను నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ఫోకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై సినిమాను వీక్షించారు. వీరిలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఉన్నారు. రాజమౌళి ఈ సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
థియేటర్ నుంచి బయటకు వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినిమా చాలా అద్భుతంగా ఉంది. రొమాంటిక్ చిత్రంలో ఏదైనా వంక పెడితే యూత్ అంతా.. ముసలోడివై పోయావ్…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. ఇక దర్శకుడు అనిల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తన మనసులో ఏది అనిపిస్తే దానిని తెరకెక్కించాడు. ఎలాంటి లెక్కలు లేకుండా పేపర్‌పై ఏది రాసుకున్నాడో అదే తెరపై కనిపించేలా చూసుకున్నాడు’ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిచారు.
ఇక హీరో ఆకాశ్ గురించి మాట్లాడుతూ.. ‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఆకాశ్‌ను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుత నటుడు దొరికాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఆకాశ్ నటన ఒక లెవల్ దాటిపోయింది’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
#ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021
Also Read: Ox Died: గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన ఎద్దు మరణం.. రాత్రంతా జాగరం ఉంటూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ ఆప్డేట్.. డానియల్ శేఖర్‌కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ..