Thuppakki Sequel: తుపాకీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మురగదాస్.. హీరోగా నటించేది విజయ్ కాదా.? మరెవరంటే..
Thuppakki Sequel Murugadoss: వైవిధ్య భరితమైన చిత్రాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు దర్శకుడు మురగదాస్. కేవలం తమిళ సినిమాలకే పరిమితం కాకుండా స్పైడర్ చిత్రంతో...

Thuppakki Sequel Murugadoss: వైవిధ్య భరితమైన చిత్రాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు దర్శకుడు మురగదాస్. కేవలం తమిళ సినిమాలకే పరిమితం కాకుండా స్పైడర్ చిత్రంతో తెలుగులోనూ ప్రవేశించాడు మురగదాస్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అనంతరం వచ్చిన సర్కార్ ఫర్వాలేదనిపించినా.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈసారైనా ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్న మురగదాస్ తాను దర్శకత్వం వహించిన తుపాకీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు. నిజానికి మురగదాస్ తొలుత విజయ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నాడట కానీ.. విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో మురగదాస్ ఈ సినిమా కథను విశ్వ నటుడు కమల్‌హాసన్‌కు వినిపించాడని, దీనికి కమల్ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ -2 చిత్రంలో నటిస్తున్నాడు. అయితే అనివార్యకారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Kamal In Tupaki
Also Read: Dhanush New Movie: శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ ఫిక్స్..! సంతోషంగా ఉందంటోన్న కోలీవుడ్ స్టార్
Salman Khan: మాస్ మేనియా మసక బారుతోందా..? కొత్త జిమ్మిక్స్ ప్లే చేయబోతున్న సల్లూ భాయ్
Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మరోసారి యంగ్ హీరో తేజ.. కీలక పాత్రలో జయమ్మ..
