‘ఆర్ఆర్ఆర్‌’కు అర్థం ఇదేనా..!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఆర్ఆర్ఆర్‌ను విడదీస్తూ […]

'ఆర్ఆర్ఆర్‌'కు అర్థం ఇదేనా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 4:35 PM

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఆర్ఆర్ఆర్‌ను విడదీస్తూ అర్థవంతమైన టైటిల్‌ను పంపాలంటూ ఆ మధ్య చిత్రయూనిట్ అభిమానులను కోరిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ఎంతో మంది అభిమానులు తమకు తోచిన టైటిళ్లను పంపించారు. ఇక అందులో ఓ పేరును తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ‘రామ రౌద్ర రుషితం’ అనే పేరును ఖరారు చేసిన టీమ్.. తెలుగులో ఈ టైటిల్ బావుంటుందని భావిస్తుందట. అలాగే మిగిలిన భాషల్లో రైజ్ రివోల్డ్ రివేంజ్ అనే పేరును కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని డీవీవ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.