NBK 107: మరోసారి ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతోన్న బాలయ్య.. కొత్త సినిమా టైటిల్‌ అదేనా.?

NBK 107: 'అఖండ' చిత్రంతో తన సత్తా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి పరిచయం చేశారు నందమూరి నట సింహం బాలకృష్ణ. అఖండలో అగ్రెసివ్‌ యాక్టింగ్‌తో తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించారు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో గెలుపు తీరాలకు చేర్చారు. అఖండ ఇచ్చిన కిక్‌తో వెంటనే మరో..

NBK 107: మరోసారి ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతోన్న బాలయ్య.. కొత్త సినిమా టైటిల్‌ అదేనా.?
Balakrishna New Movie Title
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2022 | 12:33 PM

NBK 107: ‘అఖండ’ చిత్రంతో తన సత్తా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి పరిచయం చేశారు నందమూరి నట సింహం బాలకృష్ణ. అఖండలో అగ్రెసివ్‌ యాక్టింగ్‌తో తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించారు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో గెలుపు తీరాలకు చేర్చారు. అఖండ ఇచ్చిన కిక్‌తో వెంటనే మరో సినిమాను ప్రారంభించారు బాలకృష్ణ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రస్తుతం ఎన్‌బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతీ హాసన్‌ నటిస్తోంది. ఇక తాజాగా సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా లీక్‌ అయిన వర్కింగ్ స్టిల్స్‌ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కన్నడ మూవీకి రీమేక్‌ అని వస్తున్న వార్తలకు లీక్‌ అయిన ఈ ఫోటోలు బలం చేకూర్చినట్లైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాలయ్య కొత్త చిత్రం టైటిల్‌ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నారు. ఇందులో ఒక పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’గా ఉండనుందని సమాచారం. దీంతో ఇదే పేరును చిత్ర యూనిట్ టైటిల్‌గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య మరోసారి సింహా సెంటిమెంట్‌ను నమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది.

Balakrishna

బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ‘సింహా’ పేరుతో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈ టైటిల్‌కు చిత్ర యూనిట్‌ మొగ్గుచూపుతున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, దునియా విజయ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Petrol Diesel Price: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కానీ వచ్చే నెలలో మాత్రం..

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం

AP News: రాయలసీమలో తగ్గతున్న అమ్మాయిల సంఖ్య.. అనంతపురంలో మరీ దారుణం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!