Bheemla Nayak: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
Bheemla Nayak: ఏపీ(Andhrapradesh) ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) హఠాత్తుగా మరణించడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్..
Bheemla Nayak: ఏపీ(Andhrapradesh) ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) హఠాత్తుగా మరణించడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అందువల్లనే భీమ్లా నాయక్ వేడుక వాయిదా వేస్తున్నట్లు జనసేనాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తన మనసుని కలచివేసిందని చెప్పారు. ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won’t be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
Also Read: