మామ దర్శకుడితో అల్లుడు సినిమా

మామ దర్శకుడితో అల్లుడు సినిమా

విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేటా’ సినిమా తీసి సంక్రాంతికి పెద్ద హిట్ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. కమర్షియల్ సినిమాలను సైతం బాగా డీల్ చేసే కార్తీక్ సుబ్బరాజ్ తన నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.   ధనుష్ హీరోగా తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. […]

Ravi Kiran

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:46 PM

విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేటా’ సినిమా తీసి సంక్రాంతికి పెద్ద హిట్ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. కమర్షియల్ సినిమాలను సైతం బాగా డీల్ చేసే కార్తీక్ సుబ్బరాజ్ తన నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.  

ధనుష్ హీరోగా తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని వైనాట్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. పూర్తి విభిన్న కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు అల్ పాసినో ను నటింపజేసేందుకు కార్తీక్ విశ్వప్రయత్నం చేస్తున్నాడట. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యుఎస్ లోనే చేస్తారట.

ప్రస్తుతం ధనుష్ ‘అసురన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఈ చిత్రం పూర్తి కాగానే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా ని పట్టాలెక్కించనున్నాడట. ఈ సినిమాపై మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu