సూపర్ స్టార్ మహేశ్ సినిమాలో వార్నర్ ?.. 2020కి ముగింపు చెప్పిన క్రికెటర్.. నెట్టింట్లో వీడియో వైరల్..
గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లోని పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సహా చిందులేస్తున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లోని పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో సహా చిందులేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లోని డైలాగులను తన హావభావాలతో నటిస్తూ.. అందులోని పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్స్‌ను అలరించాడు. తాజాగా వార్నర్‌కు సంబంధించిన నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన వార్నర్‌కు తెలుగు ప్రజలు, టాలీవుడ్ సినిమాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా వరకు తెలుగు సినిమాల్లోని డైలాగులను తన ఎక్స్ప్రెషన్స్ జోడించాడు. అంతేకాకుండా అందులోని పాటలకు డ్యాన్స్ చేసి టిక్‌టాక్ యాప్‌లో షేర్ చేశాడు. తాజాగా వార్నర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాను తనదైన స్టైల్లో మార్చేశాడు. రీఫేస్ యాప్ ఉపయోగించి మహేష్ ఫేస్‌కు బదులుగా తన ఫోటోని యాడ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. అందులో ” ఈ సంవత్సరాన్ని ఇలా ముగిస్తున్నాను అని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోకు మహేష్ వార్నర్, మహార్షి వార్నర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram